1000 Note: త్వరలో రూ.1000 నోట్లు.. నిజమేనా..!

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ప్రజలు తమ వద్ద ఉన్న పాత రూ.1000, రూ.500 నోట్లను మార్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే రూ.2000 నోట్లు, రూ.200 నోట్లను తీసుకొచ్చారు. కొద్ది సంవత్సరాల తర్వాత రూ.2000 నోట్లను కూడా నిలిపివేశారు. ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని ఆర్బీఐ సూచించింది. ప్రజల వద్ద రూ.2000 నోట్లు దాదాపుగా బ్యాంకుల వద్దకు వెళ్లిపోయాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో కరెన్సీ నోట్లకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.

దేశంలో త్వరలో మళ్లీ రూ.1000 నోటు వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నోటు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేరు చేస్తున్నారు. పసుపు రంగులో ఉన్న ఓ నోటు ఫొటోలను షేర్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త రూ.1000 నోటును తీసుకురాబోతోందని ప్రచారం చేస్తున్నారు. కొంత మంది నోటు విడుదలకు సంబంధించిన తేదీని కూడా జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ట్వీట్ చేసింది. కొత్త రూ.1,000 నోటు విడుదలైందంటూ జరుగుతున్న ప్రచారం సరైంది కాదని స్పష్టం చేసింది. దీన్ని ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేిసంది.

1000 note

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూ.1000 నోటు జారీపై ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్న పోస్టుల అవాస్తవమని.. వాటిని ప్రజలు నమ్మొద్దని కోరింది. కరెన్సీ నోట్లకు సంబంధించిన ఏదైనా కొత్త సమాచారం ఉంటే.. అధికారిక ప్రకటనలను పరిశీలించిన తర్వాతే నమ్మాలని పీఐబీ ఫ్యాక్ట్ సూచించింది.
కాగా మన దేశంలో ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు చలామణిలో ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ కొత్తగా రూ.2,000 నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

అయితే 2023 మేలో ఆ నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అప్పటి నుంచి రూ.1,000 నోటును మళ్లీ తీసుకొస్తారనే వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+