For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar Loan: ఆధార్ కార్డుపై రూ.5 లక్షల లోన్.. అమలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత..

|

Loan On Aadhaar Card: మోదీ ప్రభుత్వం దేశప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ స్కీమ్స్ ప్రారంభించేందుకు ప్రతి విభాగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. విద్య నుంచి ఉపాధి, రైతుల నుంచి వ్యాపారుల వరకు అన్ని వర్గాల వారికీ ఇవి అందుతున్నాయి. తాజాగా ఆధార్ కార్డు లేనివారికి ఎలాంటి ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అందించటం కుదరదని UIDAI వెల్లడించింది.

ఆధార్ కార్డ్ లోన్స్..

పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర రుణాన్ని కూడా ప్రారంభించింది. అదే విధంగా సోషల్ మీడియాలో ఆధార్ కార్డ్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం రుణాన్ని అందిస్తోందంటూ ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. దీని కింద పౌరులకు కేంద్ర ప్రభుత్వం రూ.4.78 లక్షల లోన్ అందిస్తున్నట్లు తెలపబడింది.

వైరల్ పోస్ట్ లో నిజమెంత..?

వైరల్ పోస్ట్ లో నిజమెంత..?

ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ పోస్ట్‌ను వాస్తవంగా తనిఖీ చేసిన తర్వాత.. ఈ ప్రచారంలో సత్యం లేదని, ఈ వాదన పూర్తిగా నకిలీదని PIB స్పష్టం చేసింది. PIB ఫ్యాక్ట్ చెక్ ప్రకారం అలాంటి రుణం ప్రభుత్వం ఇవ్వడం లేదు. అలాగే.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలకు సూచించింది. ప్రభుత్వ పథకాల సాకుతో నిందితులు ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారని హెచ్చరించింది. దీని వల్ల ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి సైబర్ నేరగాళ్లు సులభంగా చొరబడతారని పీఐబీ పేర్కొంది.

వాట్సాప్‌లో వైరల్..

వాట్సాప్‌లో వైరల్..

ఇంతకు ముందు ప్రధాన మంత్రి బేరోజ్‌గారి యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.6,000 భృతిని ఇస్తున్నట్లు వాట్సాప్‌లో ఒక మెసేజ్ వైరల్ అయింది. దీనిని పొందటానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైందంటూ అందులో తెలపబడింది. అసలు ఈ వార్తలో వాస్తవం ఎంత అనేదానిపై PIB ఫ్యాక్ట్ చెక్ చేయగా.. ఆ వార్త పూర్తిగా ఫేక్ అని తేలింది. అందువల్ల సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో గ్యాలం వేసి కీలక సమాచారాన్ని లాగేస్తున్నాయని ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది.

English summary

Aadhaar Loan: ఆధార్ కార్డుపై రూ.5 లక్షల లోన్.. అమలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత.. | pib fact check clarifies that bank loan to people on aadhaar card news was fake that going viral

pib fact check clarifies that bank loan on aadhaar card viral news
Story first published: Wednesday, August 17, 2022, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X