SBI News: ఎస్బీఐ ఖాతాల ముసివేత..! పూర్తి వివరాలు..

Fact Check: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న సురక్షితమైన బ్యాంక్. అందుకే ఇందులో చాలా మంది తమ సేవింగ్స్, బిజినెస్ ఖాతాలను ఓపెన్ చేస్తుంటారు. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఆందోళనకు గురిచేస్తున్న వార్త ఒకటి వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో సంచలనంగా ఉన్న వార్త ప్రకారం ఎస్బీఐ ఖాతాలు క్లోజ్ అవుతున్నాయంటూ సర్క్యులేట్ అవుతోంది. ఇందులో సమాచారం ప్రకారం ఎవరైతే వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలకు పాన్ కార్డును లింక్ చేయలేదో వారి అకౌంట్స్ ఫ్రీజ్ చేయబడుతున్నట్లు ఉంది. అయితే ఈ వివరాలను వెంటనే అప్ డేట్ చేయాలంటూ కోరుతూ లింక్ తో కూడిన మెసేజ్ చాలా మంది కస్టమర్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి వాటిని నమ్మెుద్దని, తెలియని లింక్స్ యాక్సెస్ చేయటం వంటి పనులు పొరపాటున సైతం చేయెుద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్తపై వివరణ ఇచ్చింది.

PIB clarifies over Self KYC news to link PAN with bank Account to save from blocking

దీనికి సంబంధించి సైబర్ మోసగాళ్లు కొంత మందికి కాల్స్, మెసేజ్ లను పంపుతూ ఖాతా కొనసాగాలంటే వివరాలు అందించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్ బ్యాంక్ ఇలాంటి చర్యలు చేయదని, పాన్‌ వివరాలను అప్‌డేట్ చేయమని బ్యాంక్ లింక్స్ పంపబోదని పీఐబీ వెల్లడించింది. ఇలాంటి బ్యాంకింగ్ మోసాలు మీ దృష్టికి వస్తే వెంటనే సదరు వివరాలు సైబర్ క్రైమ్ సెల్ నంబర్ 1930లో లేదా రిపోర్ట్‌లో [email protected]కి మెయిల్ పంపటం ద్వారా ఫిర్యాదు అందించొచ్చని వెల్లడించింది.

సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొందరు ఎస్బీఐ యోనో వినియోగదారులను టార్గెట్ చేస్తూ సెల్ఫ్ కేవైసీ పూర్తి చేయాలంటూ అనధికారిక మెసేజ్ లు ఫోన్లకు పంపుతున్నట్లు నమూనాను పీఐబీ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. కేవైసీకి సంబంధించి ఎలాంటి పనులు ఉన్నా మీకు దగ్గరలోని బ్యాంక్ శాఖను లేదా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించటం ద్వారా పూర్తి చేసుకోవాలని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి మోసాల బారిన పడి అనేక మంది లక్షల్లో తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్న ఘటనలు చాలా సార్లు నమోదైన తరుణంలో ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రభుత్వ సంస్థ తాజాగా ఫ్యాక్ట్ చెక్ విడుదల చేయటంతో ప్రజలు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి నెలకొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+