e-auto: మార్కెట్లోకి కొత్త ఆటో.. కిలోమీటరు జర్నీకి ఖర్చు అర్థరూపాయే!
e-auto: చిన్న పల్లెల నుంచి మహా నగరాల్లో ప్రయాణాల వరకు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆటో. పియాజియో Ape వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దానిని మరింత అందిపుచ్చుకునేందుకు ఎలక్ట్రిక్ ఆటోలను కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. వీటివల్ల వాహన యజమానులతో పాటు ప్రయాణీకులకు కూడా మంచి బెనిఫిట్ లభించనున్నట్లు తెలుస్తోంది.
ఇటలీకి చెందిన వాహన తయారీ సంస్థ పియాజియో 2019లో ఎలక్ట్రిక్ కమర్షియల్ 3-వీలర్ల మ్యాన్యూఫ్యాక్చరింగ్ ప్రారంభించింది. ఇప్పటివరకు 26 వేల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సాగర్ తెలిపారు. కాగా ఇప్పుడు తమ మొదటి 3-వీలర్ ప్యాసింజర్ వెహికల్ Ape E-city FX NE Maxని తమిళనాడులో లాంచ్ చేశారు. దీని ధర 3.46 లక్షలుగా ప్రకటించారు.

145 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌తో ఈ ఆటోను ఆవిష్కరించినట్లు అమిత్ సాగర్ వెల్లడించారు. దీని రన్నింగ్ ధర కిలోమీటరకు కేవలం 50 పైసలేనని చెప్పి ఆశ్చర్యపరిచారు. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణ ఖర్చులపై ఈ వాహనం గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు అంతటా 11 డీలర్ షిప్ నెట్వర్క్స్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
వినియోగాదారులకు క్లీన్ అండ్ గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ అందించడమే కాకుండా.. ప్రయాణ అనుభవాన్ని సైతం ఈ వాహనం మెరుగుపరుస్తుందని కంపెనీ ఛైర్మన్ & MD డియెగో గ్రాఫీ ఓ ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ప్రత్యామ్నాయ ఇంధనాలతో కూడిన వాహనాలను పియాజియో తయారు చేయనున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications