For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ.1.97 లక్షలు

|

ఇటలీకి చెందిన ఆటో దిగ్గజం పియాజియో దేశంలో తొలి ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్లోకి అడుగు పెట్టింది. అపె ఈ-సిటీ పేరుతో త్రీవీలర్‌ను తీసుకు వచ్చింది. దీని ధర రూ.1.97 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం). స్వాపెబుల్ లిథియం ఐయాన్ బ్యాటరీతో ఈ త్రీవీలర్ వస్తోంది. బ్యాటరీ, ఛార్జింగ్ సదుపాయాల కోసం సన్ మొబిలిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వాహనం విడుదల కార్యక్రమంలో కేంద్రమంత్ి నితిన్‌ గడ్కరీ, పియాజియో వెహికిల్స్‌ ఎండీ, సీఈఓ పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్ టెక్నాలజీ అభివృద్ధిలో పియాజియో గ్రూప్‌రు పదిహేనేళ్ల చరిత్ర ఉందని, దీని ద్వారానే భారత మార్కెట్ కోసం ఉత్పత్తులు తెచ్చామని కంపెనీ ఎండీ కమ్ సీఈవో అన్నారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశముండే బ్యాటరీతోపాటు ఫిక్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ ఉత్పత్తుల్ని కూడా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. పదిహేనేళ్లుగా ఎలక్ట్రిక్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో పియాజియో గ్రూప్‌కు అనుభవం ఉందన్నారు. దీనిని భారత ఉత్పత్తుల్లో కూడా తీసుకొస్తున్నామన్నారు.

మోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమందిమోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమంది

Piaggio launches its maiden electric product Ape E-City at Rs 1.97 lakh

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి 2018-2022 మధ్య రూ.300 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు చెప్పారు. ఈ త్రీవీలర్స్‌ను నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం తప్పనిసరి చేయకముందే కంపెనీలు ఎలక్ట్రిక్ ఉత్పత్తులు తీసుకురావడం అభినందనీయమని గడ్కరీ అన్నారు. ఎలక్ట్రిక్ రిక్షా మోడల్స్ కూడా తీసుకు రావాలన్నారు.

English summary

ఈ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ.1.97 లక్షలు | Piaggio launches its maiden electric product Ape E-City at Rs 1.97 lakh

Piaggio Vehicles Pvt Ltd (PVPL) has launched its first electric three-wheeler, the Ape Electrik, in India today.
Story first published: Thursday, December 19, 2019, 15:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X