ఫిజిక్స్ వాల్లాతో ఎపి గవర్నమెంట్ డీల్.. ఇన్నోవేషన్ వర్సిటీ ఏర్పాటుకు వెయ్యి కోట్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ను టెక్నలాజికల్ ఇన్నోవేషన్స్ అండ్ విద్యా నైపుణ్యాల కేంద్రంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుటెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా (PW) అండ్ టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారాలు రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థను ఆధునీకరించడం, అధునాతన స్కిల్స్ పెంపొందించడం, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ప్రపంచ అవకాశాల కోసం విద్యార్థులను సిద్ధం చేయడం లక్ష్యంగా వస్తుంది.
ఉండవల్లిలోని హెచ్‌ఆర్‌డీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపును ఎత్తిచూపారు. యువతను నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్ తో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఫిజిక్స్ వాల్లా, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి AI- ఫోకస్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE) అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ (UoI)లను ఏర్పాటు చేస్తుంది.
ఫిజిక్స్ వల్లా వ్యవస్థాపకుడు అండ్ CEO అలఖ్ పాండే మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థులను స్కిల్స్ రెడీ చేయడం కోసం PW మిషన్‌ను హైలైట్ చేశారు. సహ-వ్యవస్థాపకుడు ప్రతీక్ బూబ్ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల డిమాండ్‌లను తీర్చడానికి టాలెంట్ అభివృద్ధి PW పాత్రను హైలెట్ చేసారు. GSV వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ డెబోరా క్వాజో విద్యారంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విద్యలో డీప్ టెక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏకీకృతం చేయడం కోసం ఈ ఇన్నోవేషన్ ఒక నమూనాగా వర్ణించారు.
భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులను సిద్ధం చేయడం, పటిష్టమైన విద్యా పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ఈ సంస్థ ప్రయత్నాల లక్ష్యం అని TBI ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులతో కలిసి పనిచేయడంలో స్కిల్స్ కి ప్రసిద్ధి చెందిన TBI పాలసీ, టెక్నాలజీ సోలుషన్స్ ద్వారా ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ 40 దేశాలలో పనిచేస్తుంది. ఈ డీల్స్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముందు చూపుని ప్రతిబింబిస్తు యూనివర్శిటీ ఆఫ్ ఇన్నోవేషన్ వంటి కార్యక్రమాలు బోల్డ్ థింకింగ్ అండ్ నిర్ణయాత్మక చర్యను ప్రదర్శిస్తాయి ఇంకా ప్రపంచ పెట్టుబడిదారులని ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షిస్తుంది అని లోకేష్ అన్నారు.


Click it and Unblock the Notifications