101వ యూనికార్న్‌గా ఫిజిక్స్‌వాలా, వెస్ట్‌బ్రిడ్జ్, జీఎస్వీ వెంచర్స్ నుండి సమీకరణ
ఎడ్యుటెక్ కంపెనీ PW(ఫిజిక్స్ వాలా) యూనికార్న్ క్లబ్‌లో చేరింది. 100 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించడం ద్వారా 101వ యూనికార్న్‌గా ఘనతకెక్కింది. ఇది వెస్ట్ బ్రిడ్జ్, జీఎస్వీ వెంచర్స్ నుండి రూ.777 కోట్లు లేదా 100 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకుంది. దీంతో ఫిజిక్స్ వాలా మార్కెట్ వ్యాల్యూ 1.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తొలి నిధుల సమీకరణ దశలోనే యూనికార్న్ జాబితాలో చేరిన మొదటి కంపెనీ ఇదే. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం 1 బిలియన్ డాలర్లు దాటిన స్టార్టప్స్‌ను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు.
బిజినెస్ ఎక్స్‌పాన్షన్, బ్రాండింగ్ సహా కొత్త లర్నింగ్ సెంటర్స్, కొత్త కోర్స్ రూపకల్పన నిమిత్తం తాజాగా సేకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫిజిక్స్‌వాలా వెల్లడించింది. ఇప్పటి వరకు తమ యాప్స్‌కు 52 లక్షల డౌన్ లోడ్స్ ఉన్నాయని, యూట్యూబ్‌లో 69 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు తెలిపింది. ఈ కంపెనీలో 1900 మంది ఉద్యోగులు ఉన్నారు. 500 మంది టీచర్లు ఉన్నారు. 100 మంది వరకు టెక్ నిపుణులు ఉన్నారు. విద్యార్థుల సందేహాలు తీర్చడానికి 200 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రశ్నాపత్రాల రూపకల్పనకు 200 మంది ప్రొఫెసర్లు ఉన్నారు.

2020-21 నుండి 2021-22 మధ్య ఈ కంపెనీ ఆదాయం తొమ్మిది రెట్లు పెరిగింది. దేశంలో ప్రతి ఆరుగురు వైద్య విద్యార్థుల్లో ఒకరు, ప్రతి పది మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఒకరు ఫిజిక్స్ వాలా పూర్వ విద్యార్థిగా చెబుతున్నారు. తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లోను త్వరలో కంటెంట్ అందించనున్నారు.


Click it and Unblock the Notifications