ఫోన్‌పే కొత్త రూల్.. ఆ తప్పు చేస్తే మీ వాలెట్ నుండి డబ్బులు మాయం!
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే (PhonePe) తమ యూజర్లకు ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. చాలా రోజులుగా వాలెట్ (Wallet) వాడకుండా పక్కన పెట్టేసిన వారికి ఇకపై జరిమానా తప్పదు. అవును, ఫోన్‌పే తన వాలెట్ పాలసీని అప్‌డేట్ చేసింది. దీని ప్రకారం, ఎవరైనా యూజర్ తన ఫోన్‌పే వాలెట్‌ను చాలా కాలం పాటు ఉపయోగించకుండా అలాగే వదిలేస్తే, దానికి 'ఇన్-యాక్టివ్ మెయింటెనెన్స్ ఫీజు' కింద ప్రతి మూడు నెలలకోసారి (త్రైమాసికానికి) ₹100 చొప్పున వసూలు చేయనున్నట్లు సంస్థ తన బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా ప్రకటించింది. ఈ ₹100 ఛార్జీలో జీఎస్‌టీ (GST) కూడా కలిసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. మీరు కేవలం ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసినా, లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా యూపీఐ (UPI) పేమెంట్లు చేసినా మీ వాలెట్ యాక్టివ్‌గా ఉన్నట్లు లెక్కించరు.

ఫోన్‌పే ప్రకారం 'ఇన్-యాక్టివ్' అంటే ఏంటి?
కంటిన్యూగా 365 రోజుల పాటు (అంటే ఒక సంవత్సరం పాటు) మీ ఫోన్‌పే వాలెట్ ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరగకపోతే, ఆ వాలెట్‌ను "ఇన్-యాక్టివ్" (నిష్క్రియ) కేటగిరీ కింద మారుస్తారు.
మీరు కేవలం యాప్‌లోకి లాగిన్ అయినా, మొబైల్ రీఛార్జ్ చేసినా, కరెంట్ బిల్లు కట్టినా, క్రెడిట్ కార్డ్ లేదా లోన్ ఈఎంఐలు చెల్లించినా, లేదంటే వాలెట్ కేవైసీ (KYC) ఫారమ్ సబ్మిట్ చేసినా.. అది వాలెట్ యాక్టివిటీ కిందకు రాదు. వాలెట్ యాక్టివ్‌గా ఉండాలి అంటే నేరుగా 'వాలెట్ బ్యాలెన్స్' ఉపయోగించి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేయాల్సిందే.
డబ్బులు ఎలా కట్ అవుతాయి?
మీ వాలెట్ గనుక ఇన్-యాక్టివ్ లిస్ట్‌లోకి వెళ్తే, ఫోన్‌పే డైరెక్ట్‌గా మీ వాలెట్ నుండి ₹100 కట్ చేస్తుంది. ఒకవేళ మీ వాలెట్‌లో ₹100 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే, ఉన్న డబ్బులనే కట్ చేసి అకౌంట్‌ను 'జీరో' చేస్తుంది. అంతే కానీ, మీ అకౌంట్ మైనస్‌లోకి (నెగెటివ్ బ్యాలెన్స్) వెళ్లదు. ఈ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్లాట్‌ఫారమ్ అప్‌డేట్లు, కొత్త ఫీచర్ల డెవలప్‌మెంట్‌కు హెల్ప్ అవుతుందని ఫోన్‌పే చెబుతోంది.
యూజర్లకు ముందస్తు నోటీస్: మీ వాలెట్ నుండి డబ్బులు కట్ చేయడానికి 15 రోజుల ముందే ఫోన్‌పే మీకు ఒక అలర్ట్ నోటీస్ పంపుతుంది. ఆ 15 రోజుల లోపు మీరు ఏదైనా ఒక చిన్న వాలెట్ ట్రాన్సాక్షన్ చేస్తే మీ వాలెట్ మళ్లీ యాక్టివ్ అయిపోతుంది. తద్వారా ఈ ₹100 ఛార్జ్ పడకుండా హ్యాపీగా తప్పించుకోవచ్చు.
ఈ ఛార్జీల నుండి ఎలా తప్పించుకోవాలి?
ఈ అదనపు భారం మీపై పడకూడదు అనుకుంటే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి..
• ముందుగా మీ ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి వాలెట్ హిస్టరీ చెక్ చేసుకోండి.
• గత ఏడాది కాలంలో మీరు వాలెట్ వాడలేదని గుర్తిస్తే, వెంటనే వాలెట్ ద్వారా ఒక చిన్న పేమెంట్ చేయండి.
• కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వాలెట్ బ్యాలెన్స్ ఉపయోగించి రీఛార్జ్ లేదా మరేదైనా పేమెంట్ చేయడం అలవాటు చేసుకోండి.
ఫిన్‌టెక్ (Fintech) రంగంలో ఇలాంటి ఛార్జీలు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2021లో మోబిక్విక్ (Mobikwik) కూడా ఇన్-యాక్టివ్ యూజర్ల కోసం వాలెట్ మెయింటెనెన్స్ ఛార్జీలను తెచ్చింది. అలాగే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ (Airtel Payments Bank) కూడా ఇలాంటి రూల్స్ తెచ్చి, ఆ తర్వాత దాన్ని యాన్యువల్ మెయింటెనెన్స్ స్ట్రక్చర్‌గా మార్చింది. కాబట్టి ఫోన్‌పే వాడుతున్న వారు అలర్ట్‌గా ఉండి తమ వాలెట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications