దేశంలో ప్రస్తుతం నగదు రహిత లావాదేవీల హవా నడుస్తోంది. భౌతిక కరెన్సీతో అవసరం లేకుండా ఫోన్ల ద్వారా ప్రజలు ఎక్కువగా పేమెంట్లు చేస్తున్నారు. UPI ప్రవేశపెట్టిన నాటి నుంచి వీటి సంఖ్య మరింత పెరిగింది. వినియోగదారుల ఆదరణ పెరుగుతుండటంతో పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లు.. కేవలం బిల్ పేమెంట్లే కాకుండా పలు ఇతర సేవలను సైతం ప్రవేశపెట్టాయి. ఈ రంగంలో మరింత ఎదగాలనే ప్రణాళికలతో నిధులను సమీకరిస్తూ ఫోన్ పే ముందంజలో ఉంది.

పెద్దఎత్తున క్యాపిటల్ సమీకరణ:
టైగర్ గ్లోబల్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ద్వారా 100 మిలియన్ డాలర్లను ఫోన్ పే సమీకరించింది. ఈ నిధులను తన చెల్లింపులు, బీమా వ్యాపారాల విస్తరణకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. రుణాలు ఇవ్వడం, స్టాక్ బ్రోకింగ్, ONDC-ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను సైతం ప్రారంభించడనికి సిద్ధపడుతోంది. లక్ష్యానికి అనుగుణంగా, దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది.

మొన్న 350.. ఇప్పుడు మరో 100:
వ్యాపార విస్తరణ కోసం పెద్ద మొత్తంలో నిధులను సమీకరించడానికి ఫోన్ పే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు గతేడాది అక్టోబరులోనే వార్తలు హల్ చల్ చేశాయి. ఇందులో భాగంగా 'జనరల్ అట్లాంటిక్' నుంచి ఇటీవల 350 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. ఇది జరిగిన కొద్ది వారాలకే ఇప్పుడు మరో 100 మిలియన్ డాలర్లను సేకరించి అత్యంత విలువైన ఫిన్ టెక్ గా అవతరించింది. GigIndia, WealthDesk, OpenQలను గతేడాది కొనుగోలు చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న IndusOS కొనుగోలును సైతం పూర్తి చేసింది.

UPIలో మార్కెట్ లీడర్:
డిజిటల్ లెండింగ్ యాప్ లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ (MeiTY) కొరడా ఝళిపిస్తున్న సమయంలో.. ఫోన్ పే రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే చైనీస్ లెండింగ్ యాప్ లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతోనే వాటిని నిషేధిస్తున్నట్లు ఫోన్ పే CEO సమీర్ నిగమ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమకేమీ ఇబ్బంది ఉండదని ధీమా వ్యక్తం చేశారు. 400 మిలియన్లకు పైగా వినియోగదారులతో UPI లావాదేవీల్లో మార్కెట్ లీడర్ గా ఫోన్ పే కొనసాగుతోంది. దేశంలో నెలవారీ జరుగుతున్న UPI చెల్లింపుల్లో 47 శాతం వాటా దీని సొంతం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications