పేమెంట్స్ యాప్స్ లో అగ్రగామిగా ఉన్న ఫోన్ పే (PhonePe) మరో సంచలన ఫీచర్‌ను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ పేమెంట్లను మరింత వేగవంతం చేస్తూ పీజీ బోల్ట్ 'PG Bolt' పేరుతో సరికొత్త వన్-క్లిక్ పేమెంట్ సొల్యూషన్‌ను లాంచ్ చేసింది. వీసా (Visa) , మాస్టర్ కార్డ్ (Mastercard) వినియోగదారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

డిజిటల్ లావాదేవీల ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఫోన్ పే'PhonePe PG Bolt' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రతీసారి కార్డ్ నంబర్, CVV ఎంటర్ చేయడం లేదా ఇతర పేజీలకు రీడైరెక్ట్ అవ్వడం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగానే ఈ సరికొత్త వన్-క్లిక్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.
డివైజ్ టోకనైజేషన్ అంటే ఏమిటి?
ఈ 'PG Bolt' ఫీచర్ ప్రధానంగా 'డివైస్ టోకనైజేషన్' (Device Tokenization) అనే టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. దీని ద్వారా వినియోగదారుడి కార్డ్ వివరాలు సురక్షితమైన 'టోకెన్ల' రూపంలో సేవ్ చేయబడతాయి. ఒకసారి మీ వీసా లేదా మాస్టర్ కార్డ్‌ను ఫోన్ పే (PhonePe) యాప్‌లో టోకనైజ్ చేస్తే.. ఆ తర్వాత మీరు ఫోన్‌పే గేట్‌వేను ఉపయోగించే ఏ వెబ్‌సైట్ లేదా యాప్‌లోనైనా మళ్లీ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
CVV అవసరం లేని పేమెంట్స్!
చాలామందికి పేమెంట్ సమయంలో CVV నంబర్ గుర్తుండక ఇబ్బంది పడుతుంటారు. అయితే 'PG Bolt' ద్వారా ఒకే డివైస్ నుండి లావాదేవీలు చేస్తున్నప్పుడు CVV ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది పేమెంట్ స్టెప్స్‌ను తగ్గించడమే కాకుండా.. యూజర్లను వేరే వెబ్‌సైట్ పేజీలకు రీడైరెక్ట్ చేయకుండా మర్చంట్ యాప్‌లోనే లావాదేవీని పూర్తి చేస్తుంది. దీనివల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ రేట్ చాలా వరకు తగ్గుతుంది.
లాభాలు ఇవే..
ఫోన్ పే (PhonePe) మర్చంట్ బిజినెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "ఈ ఫీచర్ కోట్లాది మంది భారతీయులకు డిజిటల్ పేమెంట్లను సులభతరం చేస్తుంది. మర్చంట్లు తమ యాప్ ఇంటర్‌ఫేస్ కు తగ్గట్టుగా దీనిని కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లు మధ్యలో పేమెంట్ ఆపేసే అవకాశాలు తగ్గుతాయి" అని పేర్కొన్నారు.
మరిన్ని టెక్ ఫీచర్లు..
ఫోన్‌పే ఎల్లప్పుడూ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ టోకనైజేషన్ పద్ధతి వల్ల మీ అసలు కార్డ్ వివరాలు హ్యాకర్లకు చిక్కే అవకాశం ఉండదు. భవిష్యత్తులో రూపే (RuPay) కార్డ్ వినియోగదారులకు కూడా ఇలాంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీసా, మాస్టర్ కార్డ్ యూజర్లు ఈ వేగవంతమైన వన్-క్లిక్ పేమెంట్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.
ఏదేమైనా ఫోన్ పే (PhonePe) తీసుకొచ్చిన ఈ మార్పు ఆన్ లైన్ వ్యాపారులకు, సాధారణ వినియోగదారులకు ఒక వరంలా మారనుంది. షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ ఇండియాను డిజిటల్ పేమెంట్లలో అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా ఇది ఒక గొప్ప అడుగు అని చెప్పొచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications