రూ. 12 వేల కోట్లతో PhonePe మెగా IPO వస్తోంది.. పెట్టుబడిదారులు డబ్బులు రెడీ చేసుకోండిక..
అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని PhonePe IPO కోసం గట్టిగానే పావులు కదుపుతోంది. ఈ కంపెనీ IPOకు సంబంధించిన ముసాయిదా ఫైలింగ్ ను SEBI (మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ)కి సమర్పించింది. ఈ ఫైలింగ్ గోప్యమైన ప్రీ-ఫైలింగ్ మార్గం ద్వారా జరిగింది. అంటే PhonePe కంపెనీ IPO గురించి మార్కెట్‌కు పూర్తిగా వివరాలు వెల్లడించకుండానే,IPO ప్రొసెస్ ప్రారంభించింది.
PhonePe IPO మొత్తం దాదాపు రూ. 12 వేల కోట్ల (1.35 బిలియన్ డాలర్లు)కు చేరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగాOFS (Offer for Sale) ఉంటుంది. కొత్త షేర్ల ఎలాంటి ఇష్యూ లేదు. అంటే IPO ద్వారా కంపెనీ కొత్త ఫండ్స్ లేవు. ఈ OFS ద్వారా వాల్‌మార్ట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన వాటాదారులు తమ వాటాల నుండి సుమారు 10 శాతం అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది.

PhonePe ప్రధానంగా డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఇది ప్రముఖ ప్లేయర్. Walmart మెజారిటీ వాటాను కలిగి ఉంది. మరోవైపు, Tiger Global, Microsoft, General Atlantic, Ribbit Capital, TVS Capital, Tencent, Qatar Investment Authority వంటి ప్రముఖ సంస్థలు కూడా PhonePeలో పెట్టుబడులు పెట్టాయి.
రహస్య ప్రీ-ఫైలింగ్ ద్వారా కంపెనీలు IPO వరకు ముఖ్యమైన వ్యాపార వివరాలు, ఆర్థిక కొలమానాలు, లాభ నష్టాల వివరాలు మార్కెట్‌కు వెల్లడించకుండానే ఫైలింగ్ చేయవచ్చు. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే ప్రత్యర్థుల నుండి వ్యాపార సమాచారం రహితంగా ఉంచడం. IPOకు తుది అంగీకారం తర్వాత మాత్రమేనని చెప్పవచ్చు. PhonePe కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను పబ్లిక్‌గా విడుదల చేస్తుంది.
PhonePe IPO, భారతదేశంలో ఫిన్‌టెక్ రంగంలో అతిపెద్ద IPOలలో ఒకటి గా భావించబడుతుంది. సీక్రెట్ ఫైలింగ్ చేసింది కాబట్టి.. కంపెనీ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా IPO తేదీని మార్చుకునే అవకాశం కూడా ఉంది. పెట్టుబడిదారులు, ముఖ్యంగా Institutional Investors, OFSలో భాగంగా వాటాలను కొనుగోలు చేయవచ్చు. ఈ IPO ద్వారా PhonePeలో ఇప్పటికే ఉన్న పెద్ద పెట్టుబడిదారులు తమ లాభాలను కాంపెయిన్ల ద్వారా రియలైజ్ చేసుకోవడానికి సౌకర్యం ఉంటుంది. కొత్త పెట్టుబడిదారులు కూడా కంపెనీలో భాగస్వామ్యాన్ని పొందవచ్చు.
PhonePe యొక్క వ్యాపార విస్తరణ, వినియోగదారుల సంఖ్య, డిజిటల్ చెల్లింపుల విప్లవం వంటి అంశాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఏదేమైనా PhonePe IPO భారత ఫిన్‌టెక్ రంగంలో పెద్ద దశాబ్దపు IPOగా నిలవబోతోంది. పెట్టుబడిదారులు, మార్కెట్, ఫైనాన్షియల్ నిపుణులందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications