ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్ పే, గూగుల్ పే లే గుర్తొచ్చేవి. కానీ తాజాగా కొత్త యాప్స్ కూడా ఎంట్రీ ఇచ్చి, "మేము కూడా ఉన్నాం" అని చెప్పేలా చేస్తున్నాయి. అందులో సచిన్ బన్సాల్ యొక్క 'నావి' మరియు ఫ్లిప్కార్ట్ బ్యాక్డ్ 'సూపర్. మనీ' ఫుల్ హైలైట్ అవుతున్నాయి. ఈ మార్పు రాబోయే రోజుల్లో యూపీఐ ఎకోసిస్టమ్‌ను పూర్తిగా మార్చే ఛాన్స్ ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
అసలా యూపీఐ (UPI) మన రోజువారీ జీవితంలో ఎంత కీలకమైందో చెప్పక్కర్లేదు. నెలకు 20 బిలియన్‌కి పైగా లావాదేవీలు దాదాపు రూ. 25 లక్షల కోట్ల విలువ జరుగుతున్నాయి. చాయ్ తాగినా, షాపింగ్ చేసినా, గోల్డ్ కొన్నా... ఎక్కడ చూసినా యూపీఐ వాడకం తప్పనిసరిగా మారిపోయింది.

ఫోన్‌పే దేశంలోనే పెద్ద మొబైల్ పేమెంట్ కంపెనీ. కానీ గత ఏడాదిలోనే దాదాపు "2.6% షేర్ కోల్పోయింది". గూగుల్ పే కూడా రెండో స్థానంలో ఉన్నప్పటికీ దాని షేర్ "1.5% కి పడిపోయింది".
అయినా ఈ రెండు యాప్‌లు కలిపి ఇప్పటికీ "80% ట్రాన్సాక్షన్స్"ను హ్యాండిల్ చేస్తున్నాయి. PhonePe ఒక్కటే "45% మార్కెట్ షేర్"ను పట్టుకుంది. అంటే డామినేషన్ తగ్గినా ఇంకా వీటిదే పైచేయి.
ఒకప్పుడు టాప్ 3లో Paytm బలంగా నిలిచింది. కానీ కొత్త పోటీ, లైసెన్స్ ఇష్యూల వల్ల కొంత వెనక్కి వెళ్లింది. అయినా యూపీఐ మార్కెట్లో ఇంకా చిన్న షేర్ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో అమెజాన్ పే, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు కూడా ఖాళీగా లేవు. అమెజాన్ పేలో UPI సపోర్ట్‌ను జోడించగా, ఫ్లిప్‌కార్ట్ మాత్రం super.money అనే వేరు బ్రాండ్‌తో రంగంలోకి దిగింది. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ, పేమెంట్స్ కూడా తమ ప్లాట్‌ఫార్మ్‌లోనే జరిగేలా చూసుకోవడం వాళ్ల స్ట్రాటజీ.
కొత్తగా వచ్చిన యాప్‌లు మాత్రం కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్స్, క్యాష్‌బ్యాక్‌లు, యూజర్-ఫ్రెండ్లీ ఫీచర్స్ మీద దృష్టి పెడుతున్నాయి.
Navi: ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ సచిన్ బన్సల్ లీడ్ చేస్తున్న ఈ యాప్ కొత్త యూజర్లను వేగంగా సంపాదిస్తోంది.
super.money: ఫ్లిప్‌కార్ట్ సపోర్ట్‌తో వస్తున్న ఈ యాప్ కూడా అగ్రెసివ్ మార్కెటింగ్‌తో గ్రౌండ్ ని
పెంచుకుంటోంది.
Bhim: NPCI సొంత యాప్ కూడా కాస్త కాస్త మార్కెట్ ని గెలుస్తోంది.
NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అసలు లక్ష్యం మార్కెట్‌ను ఒకే 2-3 యాప్‌ల దగ్గర కాంసన్‌ట్రేట్ కాకుండా విస్తరించడం. అందుకే కొత్త యాప్స్‌కు ఫాస్ట్ అప్రూవల్స్ ఇస్తోంది. 2024లోనే 20 కొత్త కంపెనీలకు TPAP లైసెన్స్ ఇచ్చింది.
ఇంకా కొత్త యాప్స్ రూపే క్రెడిట్ కార్డ్స్‌ని యూపీఐకి లింక్ చేసి యూజర్లకు క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ ఇస్తున్నాయి. ఇది యూపీఐ వినియోగాన్ని మరింత బూస్ట్ చేస్తోంది.
ఇక కస్టమర్లకు మాత్రం దీని వల్ల లాభాలే. పోటీ పెరిగినకొద్దీ కొత్త యాప్స్ మరిన్ని క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్లు తెచ్చిపెడతాయి. భవిష్యత్తులో యూపీఐ కేవలం పేమెంట్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా, రూపే క్రెడిట్ కార్డ్ లింక్, లెండింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్, బిల్ మేనేజ్‌మెంట్ లాంటి పూర్తి ఫైనాన్షియల్ హబ్‌గా మారే అవకాశం ఉంది. అంటే ఒక యాప్‌లోనే అన్ని ఫైనాన్షియల్ సర్వీసులు పొందగలిగే సమయం దగ్గరలోనే ఉందన్నమాట.
మార్కెట్లోకి కొత్త ఆటగాళ్లు రావడంతో కస్టమర్లకు ఆప్షన్స్ పెరుగుతున్నాయి. కానీ ఫోన్‌పే, గూగుల్ పే షేర్ కాస్త తగ్గినా, ఇవి ఇంకా డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది కానీ పూర్తి రివల్యూషన్ కావడానికి టైమ్ పడుతుంది.
ఇప్పటివరకు యూపీఐ అంటే "ఫోన్‌పే, గూగుల్ పే" అనేది కామన్ సీన్. కానీ ఇప్పుడు "నావి, సూపర్.మనీ" లాంటి కొత్త యాప్స్ "ఒకసారి ట్రై చేద్దామా?" అనిపించేలా చేస్తున్నాయి. ఫ్యూచర్‌లో మనం షాపింగ్, బిల్లు పేమెంట్స్, ఫ్రెండ్స్‌కి మనీ ట్రాన్స్‌ఫర్స్ ఇలా అన్నీ UPIలోనే అవుతాయి. ఎవరి యాప్ టాప్‌లో ఉంటుందనేది కస్టమర్ ఎక్స్పీరియెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications