చిన్న ఫోన్ వాడే వారి కోసం కొత్త సర్వీస్ : 123PAYతో ఈజీ పేమెంట్స్ !
డిజిటల్ పేమెంట్స్ మరింత ఎక్కువ మందికి చేరువ చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 123PAY సర్వీస్ ప్రారంభించింది. దీనితో ఫీచర్ ఫోన్ (స్మార్ట్‌ఫోన్ కాని సాధారణ మొబైల్ ఫోన్) వినియోగదారులు కూడా సులభంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. భారతదేశంలో ఫీచర్ ఫోన్‌ల కోసం UPI సర్వీస్ విస్తృతం చేసేందుకు ఫిన్‌టెక్ దిగ్గజం PhonePe, గప్‌షప్ (Gupshup) GSPayని కొనుగోలు చేసింది. ఈ చర్యతో ఫీచర్ ఫోన్ యూజర్లు ట్రాన్సక్షన్ చేయడం మరింత సులభం కానుంది.

PhonePe అండ్ GSPay: పార్ట్నర్షిప్
ఫిన్‌టెక్ దిగ్గజం PhonePe ఫీచర్ ఫోన్ కస్టమర్ల కోసం UPI పేమెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గప్‌షప్ నుండి GSPayని కొనుగోలు చేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు. కంపెనీ ప్రకారం, భారతదేశంలోని ఫీచర్ ఫోన్ వినియోగదారులు PhonePe ద్వారా పీర్-టు-పీర్ (P2P) ట్రాన్స్ఫర్ అండ్ ఆఫ్‌లైన్ QR ట్రాన్సక్షన్స్ వంటి సేవలను ఉపయోగించుకోగలరు.
GSPay అంటే ఏమిటి?
GSPay అనేది UPI 123PAY ఆధారంగా రూపొందించిన ఒక మొబైల్ ఫోన్ యాప్. ఈ యాప్‌ను 2023 సంవత్సరంలో గప్‌షప్ ప్రారంభించింది. ఫీచర్ ఫోన్‌లలో SMS ఉపయోగించి ట్రాన్సక్షన్ చేయడం GSPay కీలక పని. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం UPI లావాదేవీల కోసం NPCI ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో GSPayని కొనుగోలు చేయడం ద్వారా PhonePe ఈ UPI 123PAY సేవను ప్రారంభించింది. అంతేకాకుండా, రాబోయే 3 నెలల్లో PhonePe దాని స్వంత ఫీచర్-ఫోన్ ఆధారిత UPI చెల్లింపుల మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది.
UPI 123PAY కోసం UPI IDని ఎలా క్రియేట్ చేయాలి ?
UPI 123PAY సేవను ఉపయోగించడానికి ముందుగా మీరు ఒక UPI IDని క్రియేట్ చేసుకోవాలి. ఫీచర్ ఫోన్ వినియోగదారులు *99# డయల్ చేయడం ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకు ముందుగా
* మీ ఫోన్ నుండి *99# నంబర్‌ను డయల్ చేయండి.
* ఇక్కడ చాల అప్షన్స్ చూపిస్తాయి, అందులో మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోండి.
* మీ డెబిట్ కార్డ్‌లో ఉన్న చివరి 6 అంకెలను ఇప్పుడు ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత, మీ UPI పిన్‌ను క్రియేట్ చేసుకోండి.
డిజిటల్ ఇండియా వైపు ఈ సర్వీస్ ఒక పెద్ద అడుగు. ఫీచర్ ఫోన్ యూజర్లు ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దుకాణదారులు ఇప్పుడు చెల్లింపులు సులభంగా తీసుకోగలుగుతారు. SMS టెక్నాలజీతో ట్రాన్సక్షన్ సురక్షితంగా ఇంకా వేగంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications