రూ.59కే ఫోన్ పే హెల్త్ ఇన్సూరెన్స్.. డెంగ్యూ, మలేరియాపై నో వర్రీస్.. లక్ష వరకు కవరేజ్..
ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు చాల పెరిగిపోయాయి. చిన్న వ్యాధి లేదా అనారోగ్యనికి గురైతే వేలల్లోనే వెచ్చించాల్సి వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సామాన్యుడి సంపదకి మించిపోతున్నాయి వైద్య ఖర్చులు. కొన్ని చోట్ల సరైన వైద్యం అందక కొన్ని చోట్ల హెల్త్ ఇన్సూరెన్స్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది.
మరికొన్ని సందర్భాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు, టౌన్ లేదా గ్రామాల్లో ఉండేవాళ్ళకు ఇన్సూరెన్స్ ఉన్న క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుత సీజన్లో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. వాటిలో డెంగ్యూ, మలేరియా అత్యంత ప్రమాదకరమైనవి. ఇప్పుడు మీరు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కేవలం 59 రూపాయలకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పొందవచ్చు. డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే డెంగ్యూ, మలేరియా ఇతర సంక్రమించే వ్యాధుల కోసం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ స్కిం ప్రారంభించింది. ఈ ప్లాన్ సంవత్సరానికి రూ. 59తో మొదలవుతుంది ఇంకా రూ. 1 లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తుంది.

ఈ స్కిం కింద డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్య, స్వైన్ ఫ్లూతో సహా 10 కంటే ఎక్కువ వ్యాధులకి ట్రీట్మెంట్, హాస్పిటల్ ఇంకా ICU ఖర్చులు కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ సీజనల్ కాదని ఏడాది మొత్తం అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
రూ. 59కే హెల్త్ ఇన్సూరెన్స్
PhonePe ఇండియాలోని టైర్-2 అండ్ టైర్-3 నగరాల్లో నివసించే వారి కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించింది, ఎందుకంటే ఈ నగరాల్లో ఆరోగ్య బీమా చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి. కార్పొరేట్ ఆరోగ్య బీమాకు అదనంగా ఈ కవరేజీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈఓ విశాల్ గుప్తా మాట్లాడుతూ బీమాను అందరికి అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్లాన్ లక్ష్యం. డిజిటల్ మాధ్యమం ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు ఆరోగ్య కవరేజీని అందించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.
PhonePe యాప్ ద్వారా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సింపుల్ గా, ఈజీగా తీసుకోవచ్చు. కస్టమర్లు యాప్‌లోని ఇన్సూరెన్స్ అప్షన్ క్లిక్ చేసి డెంగ్యూ & మలేరియా ఇన్సూరెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్లాన్ వివరాలను చూడవచ్చు అలాగే నిమిషాల్లోనే పేమెంట్ చేయవచ్చు. వైరస్, బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను నివారించాలనుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలమైనది ఇంకా బెస్ట్ సొల్యూషన్ కూడా.


Click it and Unblock the Notifications