PhonePe: ఫిన్ టెక్ దిగ్గజం ఫోన్ పే పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యాజర్లకు సులభమైన పేమెంట్ అనుభూతిని అందిస్తోంది. మొన్నటికి మొన్న లెండింగ్, ఇన్సూరెన్స్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. తాజాగా ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ కోసం మరో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది.
ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు, వ్యాపారుల కోసం ఫోన్ పే కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. IT పోర్టల్ లోకి లాగిన్ చేయకుండానే అప్లికేషన్ ద్వారా UPI లేదా క్రెడిట్ ఉపయోగించి సెల్ఫ్ అసెస్‌మెంట్, ముందస్తు పన్ను చెల్లింపు చేయవచ్చని ఫోన్ పే ఓ ప్రకటనలో తెలిపింది.

ఇందుకోసం యాప్‌లోకి లాగిన్ అయ్యి ఆదాయ పన్ను విభాగాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు చెల్లించాల్సిన పన్ను టైప్, అసెస్‌మెంట్ సంవత్సరం, పాన్ వివరాలను ఎంటర్ చేయాలి. పన్ను మొత్తాన్ని నమోదు చేసిన తర్వాత నచ్చిన విధానంలో పేమెంట్ చేయవచ్చు. చెల్లింపు జరిగిన మరుసటి రోజులోపు UTR నంబర్ జనరేట్ అవుతుంది. రెండు పని దినాల్లోపు రసీదు అందుబాటులో ఉంటుంది.
పన్ను చెల్లింపు వంటి క్లిష్టమైన ప్రక్రియను వినియోగదారులకు మరింత చేరువ చేయడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు ఫోన్ పే బిల్ పేమెంట్స్, రీఛార్జి బిజినెస్ హైడ్ నిహారిక సైగల్ తెలిపారు. తమ యాప్ లోని ఈ ఫీచర్ ద్వారా అవాంతరాలు లేకుండా, సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చన్నారు. ఇందుకోసం డిజిటల్ B2B చెల్లింపుల సేవా సంస్థ PayMateతో పార్టనర్షిప్ కలిగి ఉన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications