Phone Pe: యూఏఈ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్ పేకు లైసెన్సులు..!
యూపీఐ చెల్లింపుల రంగంలో అగ్రగామి అయిన ఫోన్‌పే యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (సీబీయూఏఈ) నుంచి రెండు చెల్లింపుల లైసెన్సుల కోసం సూత్రప్రాయ ఆమోదం పొందింది. దీంతో ఈ ఫిన్‌టెక్ సంస్థ తన తొలి విదేశీ మార్కెట్‌లో నియంత్రిత చెల్లింపుల వ్యాపారం దిశగా ఒక అడుగు ముందుకు వేసిందని ఆ సంస్థ సెప్టెంబర్ 22న ఒక ప్రకటనలో తెలిపింది. బెంగళూరుకు చెందిన ఈ ఫిన్‌టెక్ సంస్థ ప్రాథమిక నియంత్రణ సంబంధిత పరిశీలనను పూర్తి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే ముందు తుది ఆమోదం పొందవలసి ఉంటుంది. ఈ ఆమోదాలు రిటైల్ పేమెంట్ సర్వీసెస్ అండ్ కార్డ్ స్కీమ్స్ (ఆర్‌పిఎస్‌సిఎస్), స్టోర్డ్ వాల్యూ ఫెసిలిటీస్ (ఎస్‌విఎఫ్) కోసం మంజూరయ్యాయి.
సాంకేతికతను స్థానిక భాగస్వామ్యాలతో మేళవించడం ద్వారా యూఏఈ, భారత్, ప్రపంచ మార్కెట్లను కలిపే బలమైన ఆర్థిక, వాణిజ్య మార్గాలకు మద్దతు ఇవ్వాలని ఫోన్‌పే భావిస్తుందని ఫోన్‌పే సీఈఓ, అంతర్జాతీయ చెల్లింపుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేష్ పాయ్ తెలిపారు. యూపీఐ ద్వారా ఫోన్‌పే ఇప్పటికే యూఏఈలో కొనసాగుతోంది. ఫోన్‌పే, NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL)తో తన భాగస్వామ్యం ద్వారా, భారతీయులు స్థానిక QR కోడ్‌లను స్కాన్ చేసి, NEOPAY, నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తోంది.

NIPL మాతృ సంస్థ అయిన NPCI, దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ అయిన UPIని నిర్వహిస్తోంది. ఇది ఇప్పుడు 15 కంటే ఎక్కువ ఇతర దేశాలలో అందుబాటులో ఉంది. 45 శాతానికి పైగా మార్కెట్ వాటాతో ఫోన్‌పే భారతదేశంలోనే అతిపెద్ద UPI సంస్థగా ఉంది. ఈ కంపెనీ నెలకు రూ. 14 లక్షల కోట్ల విలువైన దాదాపు 12 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఈ చర్య భారతీయ వినియోగదారులకు UPI లావాదేవీలను సులభతరం చేయడం నుంచి స్థానికంగా నియంత్రించబడే చెల్లింపుల వ్యాపారాన్ని నిర్మించే దిశగా దీనిని తీసుకువెళ్లనుంది.
ఫోన్‌పే యూఏఈ బ్యాంకులు, లైసెన్స్ పొందిన చెల్లింపు సేవా సంస్థలు, టెక్నాలజీ కంపెనీలతో కలిసి పనిచేయాలని భావిస్తోంి. యూఏఈలో అధిక సంఖ్యలో భారతీయ జనాభా ఉండటం, ఎక్కవ సంఖ్యలో భారతీయులు ఆ దేశానికి ప్రయాణించడం వల్ల, యూపీఐకి ఆ దేశం ఒక ముఖ్యమైన విదేశీ మార్కెట్‌గా ఆవిర్భవించింది. NIPL, యూఏఈ చెల్లింపు కంపెనీల మధ్య భాగస్వామ్యాల ద్వారా ఆ దేశంలో యూపీఐ చెల్లింపులు కొనసాగుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
