రూ.1కి రూ.144 క్యాష్‌బాక్.. ఫోన్‌పే క్రేజీ అఫర్.. కానీ కొద్దిరోజులే ఛాన్స్..
ఒకప్పుడు గూగుల్ పే ప్రారంభ సమయంలో ఇచ్చిన క్యాష్ అఫర్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పటికి కొన్ని యాప్స్ వివిధ రకాల ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తతం మన దేశంలో మహాకుంభ మేళ కొనసాగుతుంది. మహాకుంభ మేళకి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించాడనికి వస్తుంటారు. రెండు వారాల పాటు జరిగే ఈ కుంభమేళకి ఎంతో విశిష్టత ఉంది. అయితే ఇక్కడి వచ్చే భక్తులు, యాత్రికులను దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు వసతులు కూడా కల్పిస్తున్నాయి. వీటితో తోడుగా ప్రముఖ పేమెంట్ యాప్ ఫోన్‌పే కూడా ముందుకు వచ్చింది.
ఫోన్‌పే యూజర్లకు క్యాష్‌బ్యాక్ అందించడానికి వివిధ రకాల ఆఫర్లు, స్కీమ్స్‌ను అందిస్తుంటుంది. ఫోన్‌పే ద్వారా ట్రాన్సక్షన్ చేస్తే సాధారణంగా కూపన్స్ వస్తుంటాయి. ఇంకా ప్రోమో కోడ్లు లేదా ప్రత్యేక ఆఫర్ల కూడా ఇస్తుంటుంది. అలాగే కరెంటు లేదా టివి బిల్లు పేమెంట్లు, మొబైల్ రీచార్జ్‌లు ఇతర కొనుగోళ్ళపై అఫర్ కూడా పొందవచ్చు.

తాజాగా ఫోన్‌పే యూజర్లకు మరింత ప్రయోజనాలు అందించడానికి స్పెషల్ ప్రోమోషన్లను నిర్వహిస్తుంది. మహాకుంభ్ మేళా సందర్భంగా ఫోన్‌పే డిజిటల్ పేమెంట్స్ పై ఒక ప్రత్యేక కాంపైన్ ప్రారంభించింది. ఈ కాంపైన్ పేరు 'మహాకుంభ్ కా మహాశగున్' ఆఫర్. ఈ ఆఫర్ ప్రకారం ప్రయాగ్‌రాజ్ నగరంలో తొలిసారి ఫోన్‌పే ఉపయోగించే కస్టమర్లు మొదటి ట్రాన్సక్షన్స్ పై రూ.144 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
అయితే ఈ ఆఫర్ 2025 ఫిబ్రవరి 26 వరకు మాత్రమే ఉంటుంది. అస్సలు విషయం ఏంటంటే రూ.1 ట్రాన్సక్షన్ పై కూడా ఈ అఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే కస్టమర్లు ఫోన్‌పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి UPI పిన్ సెట్ చేసుకోవాలి. అంతేకాదు ట్రాన్సక్షన్ చేసేటపుడు ఈ ఆఫర్ కోసం డివైజెస్లో లొకేషన్ సర్వీస్ ఆన్ చేయాలి. ఈ ఆఫర్ ప్రయాగ్‌రాజ్ నగరంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఫోన్‌పే ఈ క్యాంపైన్ మరింత ప్రచారం చేయడానికి మహాకుంభ్‌కు సంబంధించిన QR కోడ్స్, బ్యానర్లు, పోస్టర్లు, ఇతర బ్రాండింగ్ ఉపయోగించి ప్రజలకి అవగాహన కల్పిస్తోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత ఉత్సాహంగా మార్చడానికి ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్‌లో "హ్యాపీ మహాకుంభ్, మహాశగున్" అని ఒక మెసేజ్ కూడా విడుదల చేసింది.
ఈ క్యాంపైన్ 40 కోట్లకు పైగా భక్తులు మహాకుంభ్ మేళా సందర్శించే వారి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, వేగంగా పూర్తి చేసుకోవడాన్ని లక్ష్యంగా రూపొందించారు. భక్తులు క్యాష్ వెంట తీసుకెళ్లే ఆందోళన లేకుండా ఫోన్‌పే పేమెంట్ ద్వారా ట్రాన్సక్షన్స్ చేయవచ్చు. ఫోన్‌పే ద్వారా ఈ ఆఫర్ ప్రయాగ్‌రాజ్ నగరంలో మాత్రమే కాబట్టి ఇతర ప్రాంతాల వారికీ ఈ ఆఫర్ లభించదు.


Click it and Unblock the Notifications