PhonePe: నగదు రహిత లావాదేవీలు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ఫోన్ పే. UPI సహా వివిధ రకాలు బిల్ పేమెంట్స్ ను సైతం ఈ యాప్ ద్వారా అనుమతిస్తున్నారు. వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడం అందరికీ తెలిసిందే. అయితే మరోసారి పెద్ద ఎత్తున నిధులు సమీకరించి వార్తల్లో నిలిచింది.

మరోసారి ముందుకొచ్చిన వాల్ మార్ట్
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల యూనికార్న్ ఫోన్ పే.. మరో 200 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. తన అతిపెద్ద వాటాదారు వాల్ మార్ట్ నుంచి ఈ పెట్టుబడులను సాధించింది. ముందుగా నిర్ణయించిన బిలియన్ డాలర్ల నిధుల సమీకరణలో భాగంగా ఈ మొత్తాన్ని రాబట్టింది. తద్వారా 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కు చేరనుంది.

టార్గెట్ లో ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్
ప్రస్తుత బిలియన్ డాలర్ల సమీకరణలో భాగంగా ఇప్పటికే జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్ మరియు రిబ్బిట్ క్యాపిటల్ సహా TVS క్యాపిటల్ నుంచి మరో 100 మిలియన్ డాలర్లను రాబట్టింది. తదుపరి పెట్టుబడుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఫోన్ పే స్పష్టం చేసింది.

విస్తరణే లక్ష్యంగా..
భారత్ కేంద్రంగా సేవలు కొనసాగించే ఉద్దేశంతో ఇప్పటికే ప్రధాన కార్యాలయాన్ని ఇండియాకు మార్చింది. కొత్తగా సమీకరిస్తున్న నిధుల ద్వారా దేశీయంగా తన చెల్లింపుల వ్యవస్థ, బీమా వ్యాపారాలను మరింత మెరుగు పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి తోడు లెండింగ్, స్టాక్ బ్రోకింగ్, ONDC బేస్డ్ షాపింగ్ వంటి వివిధ విభాగాల్లో విస్తరించాలని చూస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications