For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఫోన్ పే..

|

భారతీయ డిజిటల్ చెల్లింపుల విభాగంలో ఫోన్ పే(PhonePe), గూగుల్ పే(Google Pay) తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఫిబ్రవరి 2023లో వాల్‌మార్ట్-మద్దతుగల PhonePe, Google Pay డిజిటల్ చెల్లింపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రెండు యూపీఐ ప్లాట్ ఫామ్ లు ఈ నెలలో UPI లావాదేవీలలో 81% పైగా షేరు సాధించాయి. యూపీఐ లావాదేవీలో వీటి విలువ 84.52% గా ఉంది.

గూగుల్ పే

గూగుల్ పే

ఫిబ్రవరిలో అత్యధిక సంఖ్యలో UPI లావాదేవీలను ప్రాసెస్ చేస్తూ PhonePe తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. ఇది ఫిబ్రవరి 2023లో 46.71% అంటే 351.9 కోట్లు ఫోన్ పే UPI లావాదేవీలు జరిపింది. ఇది UPI లావాదేవీల విలువలో 50.18%గా ఉంది. Google Pay ద్వారా ఫిబ్రవరిలో INR 4.24 లక్షల కోట్ల విలువైన 263.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇది మొత్తం లావాదేవీల్లో 34.34 శాతంగా ఉంది.

BHIM యాపీఐ

BHIM యాపీఐ

ఫిబ్రవరిలో INR 1.36 లక్షల కోట్ల విలువైన 113.7 కోట్ల లావాదేవీలను (మొత్తం 15.1%) Paytm ద్వారా చేశారు. పేన్ పే, గూగుల్ పే తర్వాత పేటీఎం మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఫిన్‌టెక్ కంపెనీ మొత్తం లావాదేవీ విలువలో 11% వాటాను కలిగి ఉంది. కునాల్ షా CRED ఫిబ్రవరి 2022లో కేవలం 3.65 కోట్ల లావాదేవీలను మాత్రమే చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని BHIM యాపీఐ ద్వారా 7,158.37 కోట్ల విలువైన 2.32 కోట్ల లావాదేవీలు జరిగాయి.

కేటగిరీ

కేటగిరీ

కేటగిరీల వారీ లావాదేవీల చూస్తే... కిరాణా, సూపర్‌మార్కెట్‌లు, రెస్టారెంట్‌లు, డిజిటల్ వస్తువులు కొనుగోళ్ల అధిక యూపీఐ లావాదేవీలు జరిగాయి. మొత్తంమీద, డిజిటల్ చెల్లింపులు వరుసగా రెండు నెలల వృద్ధి తర్వాత క్షీణించాయి.

English summary

UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఫోన్ పే.. | Phone Pay topped UPI payments in the month of February

PhonePe and Google Pay continue to dominate the Indian digital payments segment.
Story first published: Saturday, March 11, 2023, 17:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X