మధ్యప్రాచ్య దేశం ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం దెబ్బకు అంతర్జాతీయ చమురు సరఫరాలో ఏర్పడుతున్న ఆటంకాలను దృష్టిలో ఉంచుకుని, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి'ని (National Fuel Emergency) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్య సంఘర్షణల నేపథ్యంలో ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ మంగళవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేస్తూ, దేశానికి ఇంధన సరఫరా నిలిచిపోయే ఆసన్న ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో ఇటువంటి అత్యవసర పరిస్థితిని విధించిన ఫిలిప్పీన్స్, ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం కోసం మళ్లీ అదే బాట పట్టింది.
ఫిలిప్పీన్స్ తన చమురు అవసరాలలో దాదాపు 98 శాతాన్ని పర్షియన్ గల్ఫ్ దేశాల నుండే దిగుమతి చేసుకుంటుంది. మార్చి 20 నాటికి అందిన సమాచారం ప్రకారం..ఆ దేశం వద్ద కేవలం 45 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని కాపాడటం, నిత్యావసర సేవలు ప్రజలకు అందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడకుండా తక్షణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని మార్కోస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అత్యవసర పరిస్థితి ప్రకటన సాధారణంగా ఏడాది పాటు అమలులో ఉంటుంది. అయితే అధ్యక్షుడు దీనిని ఎప్పుడైనా పొడిగించే లేదా ఎత్తివేసే అధికారాన్ని కలిగి ఉంటారు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుండి ఫిలిప్పీన్స్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం సామాన్యుడిపై భారాన్ని పెంచింది. తమ పొరుగు దేశాలైన ఇండోనేషియా, మలేషియా లేదా థాయిలాండ్ మాదిరిగా ఫిలిప్పీన్స్ విస్తృతమైన ఇంధన రాయితీలను (Subsidies) అందించడం లేదు. అయినప్పటికీ, రవాణా రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి మోటార్‌సైకిల్ టాక్సీ డ్రైవర్లు, ఇతర ప్రజా రవాణా కార్మికులకు ఒక్కొక్కరికి 5,000 పెసోల ($83) చొప్పున ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించింది. ఇది పెరిగిన ఇంధన ధరల నుండి వారికి కొంత ఉపశమనాన్ని ఇస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈ అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంధనంతో పాటు ఆహారం, మందులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి నిత్యావసరాల లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇంధన నిల్వలను పెంచేందుకు, అక్రమ నిల్వలను అరికట్టేందుకు ఇంధన శాఖకు ప్రత్యేక అధికారాలను కల్పించారు. దీనితో పాటు, ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు విదేశాల నుండి ముడి చమురును కొనుగోలు చేసేటప్పుడు, ఒప్పంద మొత్తంలో 15 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించేందుకు (Advance Payment) అధ్యక్ష కార్యాలయం అనుమతినిచ్చింది. ఈ చర్యలన్నీ దేశంలో ఇంధన భద్రతను కాపాడటానికి, భవిష్యత్తులో తలెత్తే తీవ్ర ఆర్థిక పరిణామాల నుండి ప్రజలను రక్షించడానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications