Buy Back Of Shares: మంచి లాభాలను నమోదు చేస్తున్న చాలా కంపెనీలు ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలోని తమ షేర్లను తిరిగి కొంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నుంచి జెన్‌బర్క్ట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తన షేర్ల బైబ్యాక్ ప్రారంభం కానుంది. గత కొన్నేళ్లుగా కంపెనీ తన ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది.'

మార్కెట్లో స్టాక్ ధర..
ఏదైనా కంపెనీ బోనస్, డివిడెండ్, బైబ్యాక్ లాంటివి ప్రకటించటం చాలా గొప్ప వార్త. ఈ క్రమంలోనే జెన్‌బర్క్ట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ బైబ్యాక్ త్వరలో స్టాక్ మార్కెట్‌లో ప్రారంభం కానుంది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయంలో బీఎస్ఈలో కంపెనీ ఒక్కో షేరు ధర రూ.642గా ఉంది.

రూ.60 ఎక్కువకు కొనుగోలు..
ఫార్మా రంగంలోని ఈ స్మాల్ క్యాప్ కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.702 చెల్లించాలని బైబ్యాక్ రేటును నిర్ణయించింది. కంపెనీ ఈ బైబ్యాక్ ఆఫర్ 13 డిసెంబర్ 2022న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఆఫర్ వచ్చే 6 నెలల వరకు తెరిచి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంటే కంపెనీ బైబ్యాక్ ప్రక్రియ జూన్ 12, 2023 వరకు అందుబాటులో ఉంటుంది.

షేర్ బైబ్యాక్ వివరాలు..
* బైబ్యాక్ ఒక్కో షేరుకు ధర రూ.702
* బైబ్యాక్ 13 డిసెంబర్ 2022 నుంచి ప్రారంభం
* ఫార్మా స్టాక్ బైబ్యాక్ ముగింపు 12 జూన్ 2023
* బైబ్యాక్ సైజు రూ. 11.60 కోట్ల విలువైన షేర్లను కొంపెనీ తిరిగి కొంటోంది
* బైబ్యాక్ కారణంగా అర్హత ఉన్న పెట్టుబడిదారులు 10 శాతం ప్రయోజనం పొందుతారు

కంపెనీ పనితీరు..
గత నెలలో కంపెనీ షేరు ధర 8.33 శాతం లాభపడింది. ఎవరైనా పెట్టుబడిదారుడు 6 నెలల కిందట ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టినట్లయితే వారు 19.63 శాతం రాబడిని పొందేవారు. 2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 14 శాతం షేర్ ధర పెరిగింది. కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.699.70 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.452.10 గా ఉంది. ఫార్మా రంగంలో స్టాక్ మంచి రాబడులను అందించింది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications