Medicines Prices: దేశంలో మందుల ధరలు కంపెనీ కంపెనీకి మారిపోతుంటాయి. అయితే దీని వల్ల వినియోగదారుల్లో పెద్ద గందరగోళం ఏర్పడటం మాత్రమే కాక.. కొన్ని సార్లు అధిక ధరలకు మందులను కొని జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. మందుల ధరల నియంత్రణ విషయంలో అనేక చర్యలు చేపటుతున్న కేంద్రం తాజాగా రోగులకు ఎంతగానో ఉపయోగపడే మరో పనికి శ్రీకారం చుట్టింది.

కొత్తగా యాప్ అందుబాటులోకి..
వినియోగదారులపై బ్రాండెడ్ ఔషధాల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'ఫార్మా సహీ దామ్' అనే యాప్‌ను ప్రారంభించింది. Android, iOS రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ యాప్ ప్లేస్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది. బ్రాండెడ్ ఔషధాలకు చౌకగా కానీ ఆ మందులకు ప్రత్యామ్నాయాలను వినియోగదారులకు సూచించడానికి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ దీనిని రూపొందించింది.

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకు..
డాక్టర్ మీ వ్యాధికి బ్రాండెడ్ ఔషధాన్ని సూచిస్తే.. మీరు యాప్‌కి వెళ్లి ఔషధం పేరును టైప్ చేయవచ్చు. అప్పుడు మీరు తీసుకోవటానికి బ్రాండెడ్ ఔషధాలకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను యాప్ మీకు చూపుతుంది. వాటికి వేర్వేరు పేర్లు ఉండవచ్చు కానీ.. వాటిలో ఉండే మందుల కాంపోజిషన్(అసలు మందు) మాత్రం మారదు.

ఉదాహరణకు..
ఇక్కడి చిన్న ఉదాహరణను గమనిస్తే.. ఆగ్మెంటిన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న యాంటీబయాటిక్స్‌లో ఒకటి. ఈ బ్రాండెడ్ ఔషధం 10 మాత్రల ధర దాదాపు రూ.200. అయితే.. 6 టాబ్లెట్లు కేవలం రూ.50కి అందించే వివిధ ప్రత్యామ్నాయాలు మీకు యాప్‌లో సూచించటం జరుగుతుంది. అదేవిధంగా.. అసిడిటీకి ఉపయోగించే PAN D, 15 క్యాప్సూల్స్‌కు దాదాపు రూ.199 ధర ఉంటుంది. కానీ.. దాని ప్రత్యామ్నాయాలు 10 క్యాప్సూల్స్ ధర కేవలం రూ.22కే అందుబాటులో ఉంది.

ధరల నిర్ణయాలు ఇలా..
దేశంలో టూత్‌పేస్ట్ లేదా సబ్బు వంటి ఇతర వస్తువుల మాదిరిగానే మందుల ధరలు సైతం సరఫరా, డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే దేశంలోని 33% ఔషధాలపై ప్రభుత్వం కొంత నియంత్రణను కలిగి ఉంది. రోగులు నిత్యం ఉపయోగించే కొన్ని ఔషధాల ధరలను మాత్రం ప్రభుత్వం నియంత్రిస్తోంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ధరలను నిర్ణయించే బాధ్యతలు నిర్వహిస్తోంది. దేశంలో దాదాపు 355 ఔషధాల ధరలు, వాటి 882 ఫార్ములేషన్‌లు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO) కింద నిర్ణయించబడ్డాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications