Pharma company gift: ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ ఇచ్చిన ఫార్మా కంపెనీ.. ఎక్కడ, ఎందుకంటే..
Pharma company gift: సాధారణంగా పండుగల సమయంలో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ లు ఇస్తూ ఉంటాయి. కొన్ని సంస్థలు నగదు రూపంలో, మరికొన్ని గిఫ్ట్ వోచర్స్ లేదా ఏవైనా గృహోపకరణాలను ఇచ్చి సిబ్బందిని సంతోష పెట్టాలని భావిస్తాయి. కానీ ఓ ఫార్మా కంపెనీ మాత్రం వీటికి కాస్త భిన్నంగా ఆలోచించి.. ఉద్యోగులను ఆనందంలో ముంచెత్తింది.
హర్యానాలోని మిట్స్ హెల్త్ కేర్ అనే ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు భారీ పండుగ బోనస్ ఇచ్చింది. సంస్థలోని 12 మంది స్టార్ సెలబ్రిటీలకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. త్వరలోనే మరో 38 మందికి కూడా అందచేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇది వారి శ్రమ, నిజాయితీ, విశ్వసనీయతకు దక్కిన ప్రతిఫలం అని కంపెనీ డైరెక్టర్ MK భాటియా తెలిపారు.

"వీరు కష్టపడి పని చేయడంతోనే ఈ స్థితికి చేరుకున్నారు. సంస్థ కోసం ఏళ్ల తరబడి నిబద్ధతతో పనిచేస్తున్నారు" అని భాటియా వారిని కొనియాడారు. అయితే కారు గిఫ్ట్ గా తీసుకున్న వారిలో కొందరికి డ్రైవింగ్ చేయడం కూడా తెలియదన్నారు. ఇదే ఈ బహుమతిలో ప్రత్యేకతగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే వారు ఏమీ ఆశించలేదని, తమ పనిని నిజాయితీగా చేయడంతోనే ఈ ఫీట్ సాధించారని ప్రశంసించారు.
"నేను ఇక్కడ ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్నాను. నా పని పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నేను చేరినప్పటి నుంచి మా డైరెక్టర్ తన టీమ్‌కు కార్లు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పేవారు. కాగా ఆ కల ఈ రోజు నెరవేరింది" అని మిట్స్ హెల్త్‌కేర్‌లోని ఓ స్టార్ పెర్ఫార్మర్ తెలిపారు. ఈ గిఫ్ట్ అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications