కనీస హామీ కోరుకునే వారికి.. కనీస హామీ పెన్షన్ పథకం!
కనీస హామీ రిటర్న్ ఆధారిత పెన్షన్ స్కీంను తీసుకు వచ్చేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) కసరత్తు చేస్తోన్నట్లు చైర్మన్ సుప్రతీమ్ బంధోపాద్యాయ్ తెలిపారు. ప్రతిపాదిత పథక రూపకల్పన కోసం పెన్షన్ అథారిటీ...పెన్షన్ ఫండ్, గణాంక సంస్థలతో చర్చలు జరుపుతున్నాట్లు తెలిపారు. అదే జరిగితే కనీస హామీ పెన్షన్ పథకం త్వరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందుకే పెన్షన్ స్కీం
PFRDA చట్టం ప్రకారం మినిమం అస్యూర్డ్ రిటర్న్ స్కీం ప్రారంభించవలసి ఉందని, పీఎఫ్ పథకాల కింద వచ్చే నిధులను మార్క్ టు మార్కెట్‌లో నిర్వహిస్తారని, కాబట్టి మార్కెట్ చలనాలను బట్టి వాటి విలువలో కొంత ఊగిసలాట కనిపించవచ్చునని, అయితే కొంతమంది కనీస హామీని (రిటర్న్స్) కోరుకుంటారని, ఈ నేపథ్యంలోనే తమ పింఛన్ ఫండ్ మేనేజర్లు, ఇతర గణాంకాల సంస్థలతో కలిసి ఈ పెన్షన్ స్కీంపై చర్చిస్తున్నట్లు సుప్రతిమ్ తెలిపారు.

ఈ పథకం ఈ ఆర్థిక సంవత్సరంలో వస్తుందా?
ఈ పథకం ఈ ఆర్థిక సంవత్సరంలో వస్తుందా అని ప్రశ్నించగా... అందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, మొదటిసారి తాము సొంతగా ఈ పథకాన్ని తీసుకు వస్తున్నామని, ఇప్పటి వరకు వచ్చిన పథకాల్లో ఎలాంటి హామీ లేదని, మార్కెట్ ఎంత ప్రతిఫలాలను ఇస్తే వాటిని మేం వినియోగదారులకు బదలీ చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల నష్టభయం వినియోగదారులకు ఉండేదన్నారు.

ఆ రెండు పథకాల్లో..
నేషనల్ పెన్షన్ స్కీం, అటల్ పెన్షన్ యోచనలు ఆర్థిక శాఖతో చర్చించిన తర్వాత తీసుకు వచ్చారని గుర్తు చేశారు. అయితే ఈ రెండు పథకాలకు PFRDA పలు ఫీచర్స్‌ను జత చేసిందన్నారు. ఇప్పటి వరకు ఉన్న పథకాల్లో హామీ లేదని, ఇప్పుడు దీనిని ప్రవేశపెడితే సరికొత్త పథకం అవుతుందని బంధోపాద్యాయ్ తెలిపారు.


Click it and Unblock the Notifications