అరబిందో ఫార్మా లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌పై ఫార్మా దిగ్గజం ఫైజర్ మరియు దాని గ్రూప్ కంపెనీలు యుఎస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తమ కంపెనీకి చెందిన పేటెంట్ మెడిసిన్ అయిన ఐబ్రాన్స్ కు పేటెంట్ గడువు తీరకముందే అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జనరిక్ మెడిసిన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయని కోర్టు మెట్లెక్కింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ పై న్యూజెర్సీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఫైజర్ ,అరబిందో ఫార్మా పై యునైటెడ్ స్టేట్స్ డెలావర్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తమ మెడిసిన్ కు చౌకగా జనరిక్ వెర్షన్ విడుదల చేస్తున్నారంటూ అభ్యంతరం
అమెరికాలో రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఫైజర్ కు సంబంధించిన ఐబ్రాన్స్ మెడిసిన్ చాలా ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఇండియాలోని అరబిందో ఫార్మా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చౌకగా తమ జనరిక్ వెర్షన్ ఐబ్రాన్స్ మెడిసిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తే తమ వ్యాపార ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఫైజర్ ఆరోపిస్తోంది.
పాల్బోసిక్లిబ్ ఒక నిర్దిష్ట రకం రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే మెడిసిన్ విషయంలోనే ఫైజర్ కోర్టుకెళ్ళింది . ఐబ్రాన్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడం లేదా ఆపడం కోసం పని చేస్తుంది .

రొమ్ము క్యాన్సర్ మెడిసిన్ విషయంలో కోర్టు మెట్లెక్కిన ఫైజర్
ఫైజర్స్ 2019 వార్షిక నివేదిక ప్రకారం, 2019 లో యుఎస్‌ఎలో 3.25 బిలియన్ డాలర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఐబ్రాన్స్ మెడిసిన్ సాధించింది.
మార్చి 2019 లో, ఐబ్రాన్స్ యొక్క మార్కెట్ జెనరిక్ వెర్షన్లకు అనుమతి కోరుతూ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) కు కొన్ని ఔషధ కంపెనీలు దరఖాస్తులను దాఖలు చేసినట్లు చెప్తున్నారని, అలాంటి కంపెనీలలో అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కూడా ఉన్నాయని ఫైజర్ పేర్కొంటుంది.

2023 వరకు అమెరికా మార్కెట్లో పూర్తి పేటెంట్ హక్కులు ఉన్నట్లుగా పేర్కొన్న ఫైజర్
ఐబ్రాన్స్ మెడిసిన్ కు తమకు 2023 వరకు అమెరికా మార్కెట్లో పూర్తి పేటెంట్ హక్కులు ఉన్నట్లుగా ఫైజర్ పేర్కొంది.
పేటెంట్ గడువు ముగిసే వరకు మరే ఇతర కంపెనీ ఈ ఐబ్రాన్స్ కు జనరిక్ మెడిసిన్ విడుదల చేయకుండా ఆదేశించాలని ఫైజర్ సంస్థ కోర్టును కోరింది. న్యూజెర్సీ , డెలావర్ కోర్టులలో కేసులు దాఖలు చేసిన ఫైజర్ తమ పేటెంటు ఉన్న గడువు ముగిసే వరకు మరే ఇతర కంపెనీ జనరిక్ మెడిసిన్ ను కూడా విడుదల చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోరింది.

అమెరికా ఫార్మా సంస్థలకు ఇది మామూలే అంటున్న ఇండియన్ ఫార్మా దిగ్గజాలు
ఫైజర్ సంస్థ అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ పై వేసిన కేసులపై స్పందించిన దేశీయ ఫార్మా కంపెనీలు జనరిక్ ఔషధాల విడుదలపై అమెరికా కంపెనీలు కేసులు దాఖలు చేయడం మామూలేనని చెప్తున్నారు. దీనిపై కోర్టులో తేల్చుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు.
ఇలాంటి కేసులు గతంలో కూడా వేశారని దేశీయ ఫార్మా కంపెనీలు చెప్తున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications