పండుగ సమయంలో ఉద్యోగులకు శుభవార్త! 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అందించే వడ్డీని ఈ దీపావళికి ముందే వారి ఖాతాలలో జమ చేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) సమాయత్తమవుతోంది. దీంతో ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం కలగనుంది.
PF సబ్‌స్క్రైబర్లకు 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 8.5శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కార్మిక శాఖ సమ్మతించింది. దీంతో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని సబ్‌స్క్రైబర్లకు త్వరలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీపావళి కన్నా ముందే సబ్‌స్క్రైబర్లకు ఖాతాల్లో వీటిని జమయ్యే అవకాశాలు ఉన్నట్లు EPFO తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాలనుకున్న 8.5 శాతం వడ్డీ రేటు గత ఏడేళ్లలో కనిష్ఠం. 2018లో 8.55 శాతం వడ్డీ ఇవ్వగా, 2019లో 8.35 శాతం అందించింది. కరోనా నేపథ్యంలో ఉపసంహరణలు పెరగడం, జమయ్యే నిధులు తగ్గిపోవడంతో ఈసారి తక్కువ వడ్డీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వడ్డీ రేటు తమ PF ఖాతాల్లో జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి పలు మార్గాలున్నాయి. వడ్డీకి జమ చేసిన విషయాన్ని EPFO సబ్‌స్క్రైబర్ల ఫోన్‌కు సందేశం పంపిస్తుంది. సబ్‌స్క్రైబర్ స్వయంగా తెలుసుకోవాలనుకుంటే మెసేజ్ పంపించడం ద్వారా తెలుసుకోవచ్చు. PF రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 'EPFOHO UAN ENG' అని టైప్ చేసి 7738299899 మొబైల్ నెంబర్‌కు సందేశం పంపించాలి. లేదా 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. EPFO వెబ్‌సైట్, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications