2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 8.50 శాతంగా నిర్ణయించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). ఈ నిర్ణయం అమలులోకి వస్తే పీఎఫ్ ఫండ్‌పై వడ్డీ రేటు 0.15 శాతం తగ్గుతుంది. ఇంతకుముందు 8.65 శాతంగా ఉంది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక శాఖ ఆమోదించాలి. ఆమోదం లభించే అవకాశాలే ఉన్నాయి.

రూ.34వేల కోట్ల వరకు వడ్డీ
ఈపీఎఫ్ఓ నిర్ణయంతో ఉద్యోగులు, కార్మికులకు పీఎఫ్ ఫండ్‌పై వచ్చే ప్రతిఫలం తగ్గుతుంది. ప్రతి సంవత్సరం భవిష్యనిధి నిల్వలపై సగటున దాదాపు రూ.32 నుండి రూ.34 వేల కోట్ల వడ్డీ వస్తోంది. ఈపీఎస్ కింద వడ్డీ, ఇతర ఆదాయాన్ని పరిగణలోకి తీసకొని నిర్వహణ ఖర్చులు తీసివేయగా మిగతా మొత్తాన్ని సబ్‌స్క్రైబర్లకు వడ్డీ రూపంలో ప్రతిఫలంగా చెల్లిస్తారు.

ఆ తర్వాత వడ్డీ జమ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించడంతో ఈపీఎఫ్ఓకు రూ.700 కోట్ల మిగులు ఉంటుంది. 8.55 శాతంగా నిర్ణయించినా రూ.300 కోట్లు మిగిలే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత వడ్డీనే కొనసాగించాలని బీఎంఎస్ డిమాండ్ చేసింది. కానీ ఫలితం రాలేదు. వడ్డీపై ఈపీఎఫ్ఓ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక శాఖ... ఆర్థిక శాఖకు పంపిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది.

వడ్డీని ఎలా లెక్కిస్తారు
ప్రతి నెల పీఎఫ్ ఫండ్‌ను పరిగణలోకి తీసుకొని ఏడాదికి 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేస్తారు. ప్రతి నెల పీఎఫ్ ఫండ్ నిల్వ 8.5/12 చొప్పున గణిస్తారు. నెలనెల గణించిన వడ్డీ ఆర్థిక సంవత్సరం చివరలో అంటే మార్చి 31న ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అప్పటి వరకు జమ అయిన నిల్వ, ఆ నెల కట్టిన చందాపై ఈ వడ్డీ లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివరలో జమ చేసిన వడ్డీతో కలిసిన పీఎఫ్ ఫండ్ తదుపరి ఏడాదికి లెక్కింపులో మూలనిధిగా మారుతుంది.

ఆయా సంవత్సరాల్లో వడ్డీ రేట్లు ఇలా..
వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ ఏడేళ్ల కనిష్టానికి తగ్గించింది. 2012-13లో 8.50 శాతం, 2013-14, 2014-15లలో 8.75 శాతం, 2015-16లో 8.80 శాతం, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం, 2018-19లో 8.65 శాతం, 2019-20లో 8.50 శాతంగా ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications