ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి దాదాపుగా ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు ప్రతి నెలా పీఎఫ్ కు చందా చెల్లిస్తారు. దీనికి ఈపీఎఫ్ సంస్థ కూడా కొంత వడ్డీ చెల్లిస్తోంది. పీఎఫ్ చెల్లించే వారికి మధ్యలో ఏమైనా డబ్బు అవసరం ఉంటే.. తీసుకోవచ్చు. అలాగే మీరు రిటైర్ అయిన తర్వాత మీకు డబ్బుతో పాటు ఫించన్ కూడా వస్తుంది. అయితే చాలా మంది పీఎఫ్ చందదారులకు బీమా కవరేజీ ఉంటుందని తెలియదు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్రమం తప్పకుండా EPFకి విరాళాలు అందించే సభ్యులకు 7 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. ఈ పథకం కింద బీమా పొందేందుకు సభ్యులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం అంటారు. రూ.15,000లోపు ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.

ప్రాథమిక జీతం రూ. 15,000 కంటే ఎక్కువ ఉన్న సభ్యులు కూడా రూ. 6 లక్షల వరకు బీమా గరిష్ట ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. గత 12 నెలల EPF సభ్యుల సగటు నెలవారీ చెల్లింపు కంటే క్లెయిమ్ మొత్తం 35 రెట్లు ఎక్కువ ఉంటుంది. గరిష్టంగా రూ.7 లక్షల వరకు ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించడానికి ముందు 12 నెలల్లో పని చేస్తూ 'సర్వీస్'లో ఉంటూ మరణించినట్లైతే, వారి కుటుంబ సభ్యులకూ బీమా ప్రయోజనం పొందుతారు.
ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.2.5-7 లక్షల వరకూ ఉచితంగా బీమా సౌకర్యం పొందొచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తే కుటుంబ సభ్యులకూ గానీ, నామినీకి గానీ ఈ బీమా డబ్బులు వస్తాయి. EPF సభ్యుడు అకాల మరణిస్తే, అతని లేదా ఆమె నామినీ లేదా చట్టపరమైన వారసుడు బీమా కవరేజీని క్లెయిమ్ చేయవచ్చు. నామినీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. దీని కంటే తక్కువ ఉంటే, అతని తరపున తల్లిదండ్రులు క్లెయిమ్ చేయవచ్చు. మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రం వంటి పత్రాలు అవసరం ఉంటాయి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి


Click it and Unblock the Notifications