దాదాపు ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులైనా.. ప్రైవేట్ ఉద్యోగులైన పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఖాతాదారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఈ మధ్య శుభవార్త అందించింది. పీఎఫ్ వడ్డీ రేటును పెంచాలని ప్రతిపాదించింది. వడ్డీ రేటును 8.15 నుంచి 8.25 శాతానికి పెంచాలని సూచించింది. వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగితే లక్షలాది మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే చాలా మందికి పీఎఫ్ ఖాతా ఉన్నా.. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం తెలియదు.
చాలా మందికి తమ పీఎఫ్ యూఏఎన్ నంబర్ కూడా తెలియదు. ముందుగా పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు ఎవరైనా.. కంపెనీ హెచ్ఆర్ వద్దకు వెళ్లి పీఎఫ్ యూఏఎన్ నంబర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్లి యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోవాలి. దీని కోసం ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ యాక్టివ్ యూఏఎన్ నంబర్ పై క్లిక్ చేయాలి. తర్వాత యూఏఎన్ నంబర్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ మొబైల్ కు లాగిన్ పాస్ వర్డ్ వస్తుంది. అప్పుడు మళ్లీ పీఎఫ్ వెబ్ సైట్ కు వెళ్లి యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ పాస్ వర్డ్ టైప్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ పాస్ వర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు పాస్ బుక్ పై క్లిక్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్లేస్టోర్ యాప్ లో ఉమాంగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబర్ తో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ సర్వీస్ కు వెళ్లి యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయాలి.
మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ బ్యాలెన్సు చూపిస్తుంది. ఉమాంగ్ యాప్ లో పీఎఫ్ తో పాటు ఇతర ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే మీ రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే మీ మొబైల్ నంబర్ కు సందేశం వస్తుంది. అందులో మీ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో చూపిస్తుంది. రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నంబర్ కు ఎస్ఎంఎస్ చేసినా పీఎఫ్ బ్యాలెన్సు తెలుసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications