ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. వారం రోజులుగా స్థిరంగా ఉన్న ధరలను నేడు పెంచుతూ చమురు విక్రయ కంపెనీలు ఈ రోజు (బుధవారం, జనవరి 13) నిర్ణయించాయి. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల చొప్పున పెరిగాయి. చివరిసారి జనవరి 6న ధరలు లీటర్ పెట్రోల్ పైన 26 పైసలు, డీజిల్ పైన 25 పైసలు చొప్పున పెరిగాయి. అంతకుముందు దాదాపు నెల రోజుల పాటు ధరల్లో మార్పులేదు. వారం తర్వాత ఇప్పుడు మళ్లీ పెరిగాయి.

పెట్రోల్ రూ.91 క్రాస్
పెరిగిన అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.84.45, లీటర్ డీజిల్ రూ.74.63గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.91.07, లీటర్ డీజిల్ రూ.81.34గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.87.18, లీటర్ డీజిల్ రూ.79.95గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.85.92, లీటర్ డీజిల్ రూ.78.22గా ఉంది.
ముంబైలో పెట్రోల్ ధరలు రూ.91ని దాటాయి. జయపురలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికస్థాయికి చేరాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.91.85, డీజిల్ రూ.83.87గా ఉంది.హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.85, లీటర్ డీజిల్ ధర రూ.81,45గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో జంప్
అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి. డబ్ల్యుటీఐ క్రూడ్, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు వరుసగా 1.3 శాతం పెరిగి 53.88 డాలర్లు, 79 సెట్లు పెరిగి 57.37 డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సగటున ఒక బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగితే, ఏడాదికి భారత్ ఇంపోర్ట్ బిల్ రూ.10,700 పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా భారత చమురురంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి.

ఇటీవల కీలక నిర్ణయం
చమురు ఉత్పత్తి స్వచ్చంధ కోతకు ఇటీవల సౌదీ అరేబియా సిద్ధమైంది. ఈ ప్రభావం చమురు ధరలపై పడుతోంది. చమురు ఉత్పత్తి దేశాలు ఇటీవల సమావేశమైనప్పుడు ఉత్తత్తి కోతపై నిర్ణయం తీసుకున్నాయి. ఆ సమయంలో అంచనాల కంటే ఎక్కువగా సౌదీ అరేబియా ఉత్పత్తి కోతకు సిద్దఫడింది. దీంతో చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications