For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol sales: ధరల పెరుగుదల, 10 శాతం తగ్గిన పెట్రోల్ సేల్స్

|

మార్చి 2022లో చమురు డిమాండ్ ఇటీవలి గరిష్టానికి చేరుకోగా, ఏప్రిల్ నెల మొదటి పదిహేను రోజుల్లో మాత్రం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా మన వద్ద ధరలు పెరిగాయి. దీంతో డిమాండ్ స్వల్పంగా తగ్గింది. రికార్డ్ స్థాయిలో ధరలు పెరగడంతో మార్చి అర్ధభాగంతో పోలిస్తే ఏప్రిల్ అర్ధభాగంలో పెట్రోల్ విక్రయాలు దాదాపు పది శాతం తగ్గగా, డీజిల్ డిమాండ్ 15.6 శాతం క్షీణించింది. కరోనా సమయంలోను స్థిర వృద్ధిని నమోదు చేసిన వంటగ్యాస్ కూడా 1.7 శాతం మేర వినియోగం తగ్గింది.

నవంబర్ 4వ తేదీ నుండి మార్చి 22వ తేదీ వరకు 137 రోజుల పాటు దేశీయ చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలు భారీగా పెరిగినప్పటికీ ఎన్నికల కారణంగా ధరలు పెంచలేదు. బ్యారెల్ చమురు అంతర్జాతీయ మార్కెట్‌లో 30 డాలర్లకు పైగా పెరిగింది. ఈ పెరుగుదలను మార్కెటింగ్ కంపెనీలు క్రమంగా కస్టమర్లకు బదలీ చేశాయి. మార్చి 22వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ మధ్య పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకు పెరిగాయి. దీంతో ఏప్రిల్ మొదటి పదిహేను రోజుల్లో చమురు వినియోగం తగ్గింది.

Petrol sales skid 10 percent so far in April on high prices

రెండు దశాబ్దాల కిందట ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసిన అనంతరం 16 రోజుల వ్యవధిలో అత్యధిక పెంపు ఇదే. మార్చి 22వ తేదీన వంట గ్యాస్ ధర రూ.50 పెరిగింది. ఏటీఎఫ్ ధరలు కూడా భారీగా పెరిగాయి. మార్చి 22న కుగింగ్ గ్యాస్ ధర రూ.50 పెరిగింది. జెట్ ఫ్యూయల్ ధరలు కిలో లీటర్ రూ.1,12,202కు పైన ఉంది. ఈ సేల్స్ నెల ప్రాతిపదికన 20.5 శాతం తగ్గాయి.

Read more about: petrol
English summary

Petrol sales: ధరల పెరుగుదల, 10 శాతం తగ్గిన పెట్రోల్ సేల్స్ | Petrol sales skid 10 percent so far in April on high prices

India's fuel sales fell in the first half of April as a record rise in prices in a short 16-day period dented demand, preliminary industry data showed on Saturday.
Story first published: Sunday, April 17, 2022, 8:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X