కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటి నుండి ఇంధన ధరల్లో మార్పులేదు. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 తగ్గించడంతో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు తగ్గాయి. మోడీ ప్రభుత్వం సెస్ తగ్గించిన తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ రూ.103.97, డీజిల్ రూ.86.67, హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ.108.20, డీజిల్ రూ.94.62గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ట్యాక్స్ విధించడమే కారణం. అంతర్జాతీయ మార్కెట్లో 2014 జూన్ నుండి 2016 జనవరి మధ్య చమురు ధరలు తగ్గగా, 2016 ఫిబ్రవరి నుండి 2018 అక్టోబర్ మధ్య పెరిగాయి. అంతర్జాతీయ, జాతీయ చమురు ధరలకు భారీ తేడా ఉండటానికి ప్రధాన కారణం పన్నులు. కేంద్రం విధించే పన్నుతో పాటు పలు రాష్ట్రాలు అధిక వ్యాట్‌ను విధిస్తున్నాయి.

45 శాతం పెరుగుదల
2021 జనవరి నుండి అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు 20 శాతం వరకు పెరిగాయి. అదే సమయంలో భారత్‌లో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు 45 శాతం పెరిగాయి. ఇందుకు పలు రాష్ట్రాల అధిక వ్యాట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుండి మే నెల మధ్య పెంచిన ఎక్సైజ్ డ్యూటీ కారణం. పెట్రోల్ పైన రూ.13, డీజిల్ పైన రూ.16 పెంచింది. అయితే ఇటీవల పెట్రోల్, డీజిల్ పైన సెస్ తగ్గించడం కాస్త ఊరట. కేంద్రం సెస్ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, కర్నాటక, అసోం, తమిళనాడు వంటి రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. తెలుగు రాష్ట్రాలు తగ్గించే ఆలోచనలో లేవు.

నాలుగేళ్లలో ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల
గత నాలుగేళ్లలో పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల ఇలా ఉంది. 2017 అక్టోబర్‌లో పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ 19.5 శాతం, అక్టోబర్ 2018న పద్దెనిమిది శాతం, జూలై 2019లో 20 శాతం, మార్చి 2020లో 23 శాతం, మే 2020లో 33 శాతం, నవంబర్ 2021లో 27.9 శాతంగా ఉంది.
2017 అక్టోబర్‌లో డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ 15.3 శాతం, అక్టోబర్ 2018న 13.8 శాతం, జూలై 2019లో 15.8 శాతం, మార్చి 2020లో 18.8 శాతం, మే 2020లో 31.8 శాతం, నవంబర్ 2021లో 21.8 శాతంగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 82.87 డాలర్లు, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ఫ్యూచర్స్ 81.59 డాలర్లకు చేరుకుంది. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 82 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ఫ్యూచర్స్ 80.53 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఇంధన ధరలపై నితిన్ గడ్కరీ
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తేనే పన్నులు తగ్గి ధరలు తగ్గుతాయన్నారు. అప్పుడు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఉంటే, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్, డీజిల్‌ను తప్పకుండా జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తారన్నారు.

ఢిల్లీలో తగ్గిన సేల్స్
ఉత్తర ప్రదేశ్, హర్యానాలు పెట్రోల్, డీజిల్ పైన పన్నులు తగ్గించడంతో ఢిల్లీలో పెట్రోల్ విక్రయాలు 25 శాతం మేర పడిపోయాయి. యూపీ, హర్యానాల్లో ఈ ఉత్పత్తులు కాస్త తక్కువకు వస్తున్నందున పరిసర ప్రాంతాల్లోని వారు ఢిల్లీ పెట్రోల్ బంకులకు దూరం ఉంటున్నారు. ఢిల్లీలోని 403 పెట్రోల్ బంకుల్లో దాదాపు నాలుగో వంతు బంకులు బార్డర్‌లో ఉంటాయి. ఢిల్లీ కంటే హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.8 తక్కువగా ఉంది. 115 పెట్రోల్ బంకులు వరకు యూపీ, హర్యానాలకు సమీపంలో ఉన్నాయని, ఈ పంపుల్లో సేల్స్ 50 శాతం నుండి 60 శాతం తగ్గాయని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ అన్నారు.
More From GoodReturns

పెట్రోల్,డీజిల్ ధరల షాక్.. ఒక్కసారిగా రూ.55 పెంపు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications