పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కొందరు పెట్రోల్ పంపు యజమానులు అక్రమ లాభాల కోసం కల్తీ చేసిన పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. ఈ కల్తీ ఇంధనం మీ వాహనం ఇంజిన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అయితే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా మీరు పెట్రోల్ స్వచ్ఛతను నిమిషాల్లోనే గుర్తించవచ్చు. అంతేకాకుండా మీరు మోసపోకుండా, మీ బైక్ ఇంజిన్‌ను కాపాడుకోవడానికి ఈ టిప్స్ పాటించండి.

నకిలీ పెట్రోల్‌ను గుర్తించే పద్ధతులు:
1. నీటి పరీక్ష: ఒక వాటర్ బాటిల్ లేదా సీసాలో కొద్దిగా పెట్రోల్ తీసుకోండి. అందులో కొన్ని చుక్కల నీటిని కలపండి. అయితే నిజమైన పెట్రోల్ నీరు లోపలికి చేరి పెట్రోల్ పైన తేలుతూనే ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్, నీరు కలవవు. ఒకవేళ కల్తీ పెట్రోల్ అయితే పెట్రోల్ నీరు కలిసిపోయి మేఘావృతమైన ద్రావణం (turbid solution) ఏర్పడుతుంది.
2. టిష్యూ పేపర్ పరీక్ష: ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానిపై కొన్ని చుక్కల పెట్రోల్ వేయండి. పెట్రోల్ ఆరిపోయిన తర్వాత దానిపై పెట్రోల్ మరక లేదా గుర్తు మిగిలి ఉంటే అది నకిలీ లేదా కల్తీ అని అర్థం. స్వచ్ఛమైన పెట్రోల్ ఎటువంటి గుర్తులు ఉండదు, ఆవిరై పోతుంది.
3. వాసన పరీక్ష: మీరు ఎప్పుడో ఒకప్పుడు పెట్రోల్ వాసన చూసి ఉంటారు. అలాంటప్పుడు కొన్ని చుక్కల పెట్రోల్‌ను ఒక కాగితంపై వేయండి. వింతగా వాసన వచ్చినా లేదా అసలు వాసన లేకపోయినా అది కల్తీ అయినట్టే. కొన్నిసార్లు కిరోసిన్ లేదా ఇతర రసాయనాలు కూడా అందులో కలుపుతుంటారు.
4. డ్రాప్ టెస్ట్: పెట్రోల్ స్వచ్ఛతను గుర్తించే ఈ పద్ధతి చాలా ఈజీ ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని చుక్కల పెట్రోల్‌ను మీ చేతిపై వేసి దాన్ని తాకడం ద్వారా పరీక్షించండి. కల్తీ పెట్రోల్ అయితే పెట్రోల్ చుక్కలలో జిడ్డు (grease) ఉంటే అది కల్తీ అయి ఉండవచ్చు. నిజమైన పెట్రోల్ అయితే అది నీటిలా అనిపించి, త్వరగా ఆవిరైపోతే అది నిజమైనది.
ఈ పద్ధతులు పాటించడం ద్వారా మీరు కల్తీ పెట్రోల్ బారిన పడకుండా మీ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు ఇంకా మీ డబ్బు ఆడ చేసుకోవచ్చు. కల్తీ పెట్రోల్ వల్ల మీ వాహనం చెడిపోయి ఆర్ధికంగా మీపై అనవసరమైన ఖర్చు భారం పడుతుంది. మీకు నమ్మకమైన పెట్రోల్ బంకుల్లో మాత్రమే పెట్రోల్ కొట్టించేల చూసుకోండి. అంతేకాకూండా బయట విడిగా అమ్మే పెట్రోల్ పై ఆధారపడటం తగ్గించుకోండి.


Click it and Unblock the Notifications