పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నేడు (గురువారం, జూలై 22) ఐదో రోజు స్థిరంగా ఉన్నాయి. గత శనివారం పెరిగిన ధరలు ఆ తర్వాత ఆదివారం నుండి యథాతథంగా ఉన్నాయి. శనివారం రోజు స్వల్పంగా పెరిగాయి. కొద్దిరోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా కూడా ధరలు పెరుగుతున్నాయి. శనివారం లీటర్ పెట్రోల్ పైన నిన్న 30 పైసలు పెరిగింది. ఈ నెలలో ఈ ఇరవై రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి.
శనివారం పెట్రోల్ ధరలు పెరిగినా, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు వరుసగా ఐదో రోజు స్థిరంగా ఉన్నాయి. గతవారం పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84, లీటర్ డీజిల్ రూ.89.87గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర ఢిల్లీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.45గా ఉంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.83, లీటర్ డీజిల్ రూ.97.76గా ఉంది.

పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
More From GoodReturns

Iran war: ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకనున్న ట్రంప్? డెడ్ లైన్ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG: భారత్కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications