స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-విజయవాడల్లో ఎంతంటే?
న్యూఢిల్లీ: రెండు రోజులుగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో బుధవారం మార్పు లేదు. గత పది రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు ఒక రూపాయి కంటే ఎక్కువ, డీజిల్ రూ.7 పైసలు తగ్గింది. ఈ రోజు (నవంబర్ 20) ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.20, డీజిల్ రూ.65.84, ముంబైలో పెట్రోల్ రూ.79.86, డీజిల్ రూ.69.06, బెంగళూరులో పెట్రోల్ రూ.76.74, డీజిల్ రూ.68.08, నోయిడాలో పెట్రోల్ రూ.75.66, డీజిల్ రూ.66.15, గురుగావ్‌లో పెట్రోల్ రూ.73.87, డీజిల్ రూ.65.18గా ఉంది.

హైదరాబాదులో పెట్రోల్ లీటర్ రూ.78.96, డీజిల్ రూ.71.85గా ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.78.54, డీజిల్ రూ.71.15 వద్ద ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ.78.17, డీజిల్ రూ.70.81గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.03 శాతం తగ్గి 60.93 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ 0.20 శాతం తగ్గి 55.46 డాలర్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications