పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడో రోజు పెరిగాయి. గత ఆదివారం నుండి ఇంధన ధరలను సమీక్షిస్తున్న ప్రభుత్వరంగ చమురు కంపెనీలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. ఈ రోజు (జూన్ 13) లీటర్ పెట్రోల్ పైన 49 పైసలు, లీటర్ డీజిల్ పైన 58 పైసలు పెంచాయి. దీంతో ఏడు రోజుల్లో దాదాపు రూ.4 పెరిగింది. కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు ధరలు యథాతథంగా ఉన్నాయి. తిరిగి జూన్ 7వ తేదీ నుండి సమీక్షిస్తున్నాయి.

హైదరాబాద్, విశాఖ సహా ఏ నగరంలో ఎంత ధర
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.75.16గా ఉంటగా, లీటర్ డీజిల్ రూ.73.39గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.82.10, డీజిల్ రూ.72.03, చెన్నైలో పెట్రోల్ రూ.78.99, డీజిల్ రూ.71.64, కోల్‌కతాలో పెట్రోల్ రూ.77.05, డీజిల్ రూ.69.23గా ఉంది. హైదరాబాదులో పెట్రోల్ ధర రూ.78.03, డీజిల్ రూ.71.73గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ రూ.76.07, డీజిల్ రూ.70.71గా ఉంది.

వారంలో రూ.4 పెరిగిన ధర
ఏడు రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ పైన రూ.3.90 పెరిగింది. అంటే దాదాపు రూ.4 పెరిగింది. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన రూ.10, రూ.13 ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా వినియోగదారులకు ఈ ప్రయోజనం అందలేదు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఎక్సైజ్ సుంకం పెంపుకు బదులు అంతర్జాతీయంగా తగ్గిన రిటైల్ రేట్ల తగ్గుదలతో సర్దుబాటు చేశాయి.

పన్నులే ఎక్కువ
చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రైస్ బిల్డప్ స్టాటిస్టిక్స్ ప్రకారం లీటర్ పెట్రోల్ పైన ఓ డీలర్‌కు రూ.18.28గా ఉంటుంది. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, డీలర్స్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ వంటివి కూడా ఉంటాయి. అయినప్పటికీ చమురు ధర, అమ్మకం మధ్య ఇప్పటికీ రూ.4 నుండి రూ.5 వరకు తేడా ఉందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పైన పలు రాష్ట్రాలు సెస్ లేదా వ్యాట్‌ను పెంచాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో పన్ను దాదాపు 70 శాతం వరకు ఉంటుంది.

ఇందుకే కస్టమర్‌కు ప్రయోజనం అందడం లేదు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలతో ముడివడి ఉంటాయి. కరోనా కారణంగా ఆటో ప్యూయల్, వియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) వంటి వాటికి డిమాండ్ భారీగా తగ్గింది. ధరలు కూడా పడిపోయాయి. ఇలా చూస్తే రిటైల్ ధరలు కూడా తక్కువగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కరోనా కారణంగా బ్రెంట్ క్రూడాయిల్, అమెరికా క్రూడ్ ఇండెక్స్ WTI 10 శాతానికి పైగా పడిపోయాయి. కానీ రిటైల్ ధరలు తగ్గలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దానిని వాహన వినియోగదారులకు బదలాయిస్తున్నారు. అయితే ధరలు తగ్గినప్పుడు మాత్రం ప్రభుత్వం కొత్త ట్యాక్స్, సుంకాలు వేయడం ద్వారా అదనపు రెవెన్యూ రాబడుతోంది. ధరలు తగ్గినప్పుడు సాధారణంగా వినియోగదారుడు లాభపడాలి. కానీ ఆ ప్రయోజనం కస్టమర్‌కు అందకుండా ఫ్రెష్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఏ రకంగా చూసినా వాహనదారుడికి ప్రయోజనం అందకుండా పోతోంది.

లాభం, ఖర్చుల ఆధారంగా ధరల నిర్ణయం
ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలకు వారి ఖర్చులు, లాభాల లెక్కల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే స్వేచ్ఛ ఉంది. ఇంధన ధరల నియంత్రణ దశలవారీగా జరిగింది. 2002లో ATF, 2010లో పెట్రోల్, 2014లో డీజిల్ పైన విముక్తి లభించింది. అంతకుముందు ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం జోక్యం ఉండేది. ఎల్పీజీ, కిరోసిన్ వంటి ఇంధనాలు ఇప్పటికీ నియంత్రణలో ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు పెంపు
ఫిబ్రవరి నెలలో అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 55 డాలర్లు ఉంది. మార్చి ప్రారంభంలో 35 డాలర్లు, మార్చి చివరి నాటికి 20 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు కాస్త కోలుకొని తాజాగా 40 డాలర్ల వరకు ఉన్నాయి. మరోవైపు, డిమాండ్ లేకపోవడంతో మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. ఇదే కాలంలో ప్రభుత్వం ఇంధన ఎక్సైంజ్ సుంకాన్ని రెండుసార్లు పెంచింది. ఈ పెంపు ప్రభావం కస్టమర్ పైన లేదని ప్రభుత్వం చెప్పింది. కానీ ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ఆ తగ్గింపు ప్రయోజనాన్ని మాత్రం పొందలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కాలంలో పెట్రోల్, డీజిల్ పైన సుంకాలు పెంచాయి.

ఎక్సైజ్ డ్యూటీ, ట్యాక్స్‌లు
మే 5వ తేదీన కేంద్రం లీటర్ డీజిల్ పైన రూ.13, లీటర్ పైన రూ.10 ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. ఈ పెంపు ద్వారా ప్రపంచంలో అత్యధిక ట్యాక్స్ వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ముందుకు వచ్చింది. రెండుసార్లు పెంపుకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ వంటి ట్యాక్సులు పెట్రోల్ పైన 107 శాతంగా ఉన్నాయి. డీజిల్‌పై 69 శాతం వసూలు చేశాయి. మొదటిసారి పెంపు తర్వత పెట్రోల్ పైన 134 శాతం, డీజిల్ పైన 88 శాతం, మే నెలలో రెండోసారి పెంపు తర్వాత పెట్రోల్ పైన 260 శాతం, డీజిల్ పైన డీజిల్ పైన 256 శాతంగా ఉంది. ఇతర దేశాల విషయానికి వస్తే జర్మనీ, ఇటలీలో రిటైల్ ధరలో 65 శాతం, జపాన్‌లో 45 శాతం, అమెరికాలో 20 శాతం ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications