Petrol Prices: వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రో ధరలు.. కారణమిదీ..
Petrol Prices: పెరిగిన పెట్రోల్ ఖర్చులతో సతమతమవుతున్న వాహనదారులు త్వరలోనే శుభవార్త విననున్నారు. ఆయా రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి లీటరుకు 4 నుంచి 5 వరకు తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
FY24కి గాను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల(OMC) వాల్యుయేషన్ సహేతుకంగానే ఉంది. కానీ ఆదాయాలపై మాత్రం గణనీయమైన అనిశ్చితి నెలకొని ఉంది. మరో ఏడాదిలోగా OPEC ముడి చమురు ధరలను పెంచే ప్రమాదమూ ఉన్నట్లు JM ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ నివేదించింది. అయితే ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల సమయంలో చమురు ధరల ట్రెండ్‌లను పరిశీలిస్తే, OMCల ఆదాయాలకు ప్రమాదం ఏర్పడవచ్చని పేర్కొంది.

నవంబర్-డిసెంబరు మధ్య కీలకమైన రాష్ట్రాల్లో జరిగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పెట్రోల్/డీజిల్ ధరను లీటరుకు రూ.4 నుంచి 5 కు తగ్గించాలని OMCలను ప్రభుత్వం కోరవచ్చు. OMCల బ్యాలెన్స్ షీట్ సహేతుకంగా ఉండి, FY24 Q1లో బలమైన లాభాలను నివేదించే అవకాశం ఉన్నందున ధరలు తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ OMCలకు సూచించవచ్చని మీడియా నివేదికలు అభిప్రాయపడుతున్నాయి.
తాజా IEA నివేదిక ప్రకారం.. రిఫైనర్‌లు కొంత మేర ఒత్తిడిని ఎదుర్కోనున్నారు. రవాణా రంగం నుంచి చమురు డిమాండ్ మందగించడం, శుద్ధి చేయని ఉత్పత్తుల పోటీ కారణంగా వారి ఆదాయాలకు గండి పడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నోట్‌లో పేర్కొంది. గ్లోబల్ రిఫైన్డ్ ప్రొడక్ట్ మార్కెట్‌ను బ్యాలెన్స్ చేయడంలో చైనా కీలక పాత్ర పోషిస్తుంది. కాగా రాబోయే ఆరేళ్లలో గ్లోబల్ స్పేర్ కెపాసిటీలో 40 శాతం చైనాలో కేంద్రీకృతమై ఉంటుందని తెలిపింది.


Click it and Unblock the Notifications