Petrol prices today: పెట్రోల్ ధరలు పెరగడం లేదు, అక్కడ లీటర్ రూ.123
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదిహేనో రోజు స్థిరంగా ఉన్నాయి. గురువారం, ఏప్రిల్ 21వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పెరుగుదల ప్రారంభమైంది. మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఇటీవల స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.
మార్చి 22వ తేదీ నుండి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి.

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్‌కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 వద్ద ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పలు ప్రాంతాల్లో సెంచరీని క్రాస్ చేశాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగాధరలో లీటర్ పెట్రోల్ రూ.123కు చేరుకుంది. ఇక్కడ డీజిల్ రూ.105.31గా ఉంది.
ఇక, ఎకో-ఫ్రెండ్లీ నేచరల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు సోమవారం నుండి రూ.3.50 పెరిగాయి. అంతకుముందు చివరిసారి ఏప్రిల్ 5వ తేదీన సీఎన్జీ ధర కిలోకు రూ.1.50 పెరిగింది.
ఇక, శ్రీలంకలో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. శ్రీలంక స్టేట్ రన్ సిలోన్ పెట్రోలియం కార్పోరేషన్ 92 ఆక్టేనే పెట్రోల్ ధరను 338 శ్రీలంక రూపాయిలకు పెంచింది. 84 రూపాయలు పెరిగినట్లు పీటీఐ వెల్లడించింది.


Click it and Unblock the Notifications