వరుసగా 6వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు, 10 రోజుల్లో ఎంత పెరిగిందంటే
పెట్రోల్ ధరలు వరుసగా మంగళవారం(ఆగస్ట్ 25) ఆరో రోజు పెరిగాయి. కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరులలో పెట్రోల్ ధరలు 11 పైసల చొప్పున పెరిగింది. ఆగస్ట్ 16వ తేదీ నుండి చమురురంగ కంపెనీలు పెట్రోల్ ధరలు పెంచుతున్నాయి. 19వ తేదీన మాత్రం పెరగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పది రోజుల్లో పెట్రోల్ ధరలు రూ.1.30 పైసలు, ముంబైలో ధర రూ.1.20 పైసలు పెరిగింది. మెట్రో నగరాల్లో ఆగస్ట్ 16వ తేదీ నుండి ఒక రూపాయి కంటే ఎక్కువగానే పెరిగింది.
ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.81.73, ముంబైలో రూ.88.39గా ఉంది. ఇతర మెట్రో నగరాల విషయానికి వస్తే చెన్నైలో రూ.84.73, కోల్‌కతాలో రూ.84.23, హైదరాబాద్‌లో రూ.84.94, బెంగళూరులో రూ.84.39, గురుగ్రామ్‌లో రూ.79.89, నోయిడాలో రూ.82.09గా ఉంది.
ఇక, డీజిల్ ధరలు లీటర్ ఢిల్లీలో రూ.73.56, ముంబైలో రూ.80.11 ఉంది. చెన్నై, కోల్‌కతా నగరాల్లో వరుసగా రూ.78.86, 77.06గా ఉంది.

వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు
ఢిల్లీలో నేటి పెట్రోల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 81.73/లీటర్
ముంబైలో నేటి పెట్రోల్ ధరలు, ఆగస్ట్ 25-Rs 88.39/లీటర్
చెన్నైలో నేటి పెట్రోల్ ధరలు, ఆగస్ట్ 25-Rs 84.73/లీటర్
కోల్‌కతాలో నేటి పెట్రోల్ ధరలు, ఆగస్ట్ 25-Rs 83.24/లీటర్
హైదరాబాద్‌లో నేటి పెట్రోల్ ధరలు, ఆగస్ట్ 25-Rs 84.94/లీటర్
బెంగళూరులో నేటి పెట్రోల్ ధరలు, ఆగస్ట్ 25-Rs 84.39/లీటర్
గురుగ్రామ్‌లో నేటి పెట్రోల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 79.89/లీటర్
నోయిడాలో నేటి పెట్రోల్ ధరలు, ఆగస్ట్ 25-Rs 82.09/లీటర్

వివిధ నగరాల్లో నేటి డీజిల్ ధరలు
ఢిల్లీలో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 73.56/లీటర్
ముంబైలో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 80.11/లీటర్
చెన్నైలో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25-Rs 78.86/లీటర్
కోల్‌కతాలో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 77.06/లీటర్
హైదరాబాద్‌లో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 80.17/లీటర్
బెంగళూరులో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25-Rs 77.88/లీటర్
గురుగ్రామ్‌లో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 74.03/లీటర్
నోయిడాలో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 73.87/లీటర్
ఘజియాబాద్‌లో నేటి డీజిల్ ధరలు, ఆగస్ట్ 25- Rs 73.71/లీటర్

మిశ్రమంగా క్రూడ్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మిశ్రమంగా ఉన్నాయి. యూఎస్ గల్ఫ్ కోస్ట్ మరోసారి ఉత్పత్తిని భారీ మొత్తంలో తగ్గించింది. ఏషియా, యూరోప్ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్పత్తిని కుదించారు. బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి బ్యారెల్ ధర 45.18 డాలర్లుగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ 0.2 శాతం తగ్గి బ్యారెల్ 42.53 డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications