పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం (మే 31) ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ముంబై, భోపాల్ సహా పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100ను దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.47, డీజిల్ రూ.92.45గా ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పెట్రోల్ రూ.102.45, డీజిల్ రూ.93.37గా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ రూ.94.23, డీజిల్ రూ.85.15గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 26 పైసలు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.25, డీజిల్ రూ.87.74కు చేరుకుంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.97.93, డీజిల్ రూ.92.83గా ఉంది.

ఈ నెలలో రూ.4కు పైగా పెంపు
మే నెలలో ఇంధన ధరలు మండిపోయాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా పెంపుతో వినియోగదారులకు షాకిచ్చాయి. పలుచోట్ల పెట్రోల్ ధర ఏకంగా సెంచరీ దాటేసింది. ఈ నెలలో చమురు సంస్థలు 16సార్లు ఇంధన ధరలను పెంచాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.4 వరకు పెరిగాయి. మే 3వ తేదీ తర్వాత నుండి దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. సోమవారం కూడా చమురు సంస్థలు పెట్రోల్ ధర 28 నుండి 29పైసలు, డీజిల్ ధరను 26 నుండి 28 పైసలు పెంచాయి.
మొత్తంగా ఈ నెలలో లీటర్ పెట్రోల్ ధరపై రూ. 3.83, డీజిల్ పైనరూ.4.42 పెరిగింది. వ్యాట్, స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి.

2019 జనవరి నుండి ధరలు ఇలా
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. 2019 జనవరి నెలలో పెట్రోల్ ధర లీటర్ రూ.68.65గా ఉంది. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు బ్యారెల్‌కు 59.27గా ఉంది. గత ఏడాది కరోనా సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 20 డాలర్ల స్థాయికి పడిపోయాయి.
కానీ దేశీయంగా పన్నులు పెంచడంతో ఇక్కడ ధరలు తగ్గలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 2019 జనవరి స్థాయికి చేరుకున్నాయి. కరోనా సమయంలో పన్నులు పెంచడంతో దేశీయంగా అప్పుడు ఉన్న ధరలతో పోలిస్తే భారీగా పెరిగాయి. 2019 జనవరిలో బ్యారెల్ ఇంధనం 59.27 డాలర్లు కాగా, ప్రస్తుతం 67.05 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో అప్పుడు పెట్రోల్ లీటర్ రూ.68.55 కాగా, ఇప్పుడు రూ.93కు పైన ఉంది.

ప్రభుత్వ పన్నులే అధికం
ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90.
డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications