For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, diesel prices today స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు గురువారం (డిసెంబర్ 23) కూడా అలాగే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.

Petrol Price Today: New rates of petrol and diesel released for December 23, 2021

ఒమిక్రాన్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. భారీగా పెరుగుతూ, అంతేస్థాయిలో పడిపోతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గగానే ఇక్కడ తగ్గవు. సగటు ద్వారా తగ్గింపు వర్తిస్తుంది. కాబట్టి మరికొద్దిరోజులు అక్కడ ధరలు తగ్గకుంటే, ఆ తర్వాత ఇక్కడ తగ్గిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చమురు మార్కెట్ పైన కనిపిస్తుంది. చమురు వినియోగం తిరిగి పుంజుకుంది. అయితే గతవారం ఒమిక్రాన్ భయాందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల క్రూడ్ ధరలు పెరిగాయి. గతవారం మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదలను రెండు వారాల క్రితం నమోదు చేసింది. అంతకుముందువారం బ్రెంట్ క్రూడ్ ఏకంగా 7 శాతం పెరగగా, గత వారం కాస్త తగ్గి 72 డాలర్లకు పడిపోయింది. అంతకుముందు వారం ఇది 75.15 డాలర్ల వద్ద ముగిసింది. అంటే వారంలో మూడు డాలర్ల మేర తగ్గింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రితం వారం 2 శాతం మేర క్షీణించి 69.42 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు వారం 71.67 డాలర్ల వద్ద ముగిసింది.

ఇటీవలి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు భారత్‌లో చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడం దేశీయంగా ధరలపై ప్రభావం చూపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గించడంతో సామాన్యుడిపై కాస్త భారం తగ్గింది. అయితే ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఏ దేశంలో, ఎంత ఉన్నాయో తెలుసా? వెనిజులాలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత చౌక. డిసెంబర్ 6వ తేదీన లీటర్ పెట్రోల్ ఇక్కడ రూ.1.885 (మన భారత కరెన్సీలో). ప్రపంచంలోనే గ్యాసోలైన్‌ను చౌకకు అందించే దేశం ఇది. ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.3.866గా ఉంది. ప్రపంచంలో చౌక ధరకు అందించే రెండో దేశం ఇది. ఇక, ప్రపంచంలోనే ఎక్కువ ధర ఉన్న దేశం హాంగ్‌కాంగ్. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.195.113. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో రూ.170.7. అమెరికాలో లీటర్ పెట్రోల్ ధర భారత కరెన్సీలో రూ.74.021. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్యాసోలైన్ ధర సగటున లీటర్‌కు రూ.90.83గా ఉంది.

English summary

Petrol, diesel prices today స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol Price Today: New rates of petrol and diesel released for December 23, 2021

IOCL has released new rates of petrol and diesel for Tuesday (Petrol-Diesel Price Today 23 Dec 2021). There has been no change in the prices as of today.
Story first published: Thursday, December 23, 2021, 7:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X