For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol, diesel prices : పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు

|

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు ఆదివారం (డిసెంబర్ 26) కూడా అలాగే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.

ఒమిక్రాన్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. భారీగా పెరుగుతూ, అంతేస్థాయిలో పడిపోతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గగానే ఇక్కడ తగ్గవు. సగటు ద్వారా తగ్గింపు వర్తిస్తుంది. కాబట్టి మరికొద్దిరోజులు అక్కడ ధరలు తగ్గకుంటే, ఆ తర్వాత ఇక్కడ తగ్గిస్తారు.

Petrol Price Today: New rates of fuel released for December 26, 2021

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చమురు మార్కెట్ పైన కనిపిస్తుంది. చమురు వినియోగం తిరిగి పుంజుకుంది. అయితే గతవారం ఒమిక్రాన్ భయాందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల క్రూడ్ ధరలు పెరిగాయి. అంతకుముందు వారం మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదలను మూడు వారాల క్రితం నమోదు చేసింది. అంతకుముందువారం బ్రెంట్ క్రూడ్ ధర 72 డాలర్లగా నమోదు కాగా, గతవారం స్వల్పంగా పెరిగి 75.88 డాలర్లకు చేరింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ అంతక్రితం వారం 71.67 డాలర్ల వద్ద ముగియగా, గతవారం 73.869 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

ఇటీవలి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు భారత్‌లో చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడం దేశీయంగా ధరలపై ప్రభావం చూపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గించడంతో సామాన్యుడిపై కాస్త భారం తగ్గింది. అయితే ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఏ దేశంలో, ఎంత ఉన్నాయో తెలుసా? వెనిజులాలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత చౌక. డిసెంబర్ 6వ తేదీన లీటర్ పెట్రోల్ ఇక్కడ రూ.1.885 (మన భారత కరెన్సీలో). ప్రపంచంలోనే గ్యాసోలైన్‌ను చౌకకు అందించే దేశం ఇది. ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.3.866గా ఉంది. ప్రపంచంలో చౌక ధరకు అందించే రెండో దేశం ఇది. ఇక, ప్రపంచంలోనే ఎక్కువ ధర ఉన్న దేశం హాంగ్‌కాంగ్. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.195.113. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో రూ.170.7. అమెరికాలో లీటర్ పెట్రోల్ ధర భారత కరెన్సీలో రూ.74.021. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్యాసోలైన్ ధర సగటున లీటర్‌కు రూ.90.83గా ఉంది.

English summary

Petrol, diesel prices : పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు | Petrol Price Today: New rates of fuel released for December 26, 2021

Petrol and diesel costs remained unchanged on Saturday, December 25, 2021.
Story first published: Sunday, December 26, 2021, 7:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X