పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి సామాన్యుడికి ఈరోజు కూడా రిలీఫ్. గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ ఇండియా ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 7, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఇటీవలే జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్‌కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.
ఒమిక్రాన్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. భారీగా పెరుగుతూ, అంతేస్థాయిలో పడిపోతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గగానే ఇక్కడ తగ్గవు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చమురు మార్కెట్ పైన ఉంటోంది. వినియోగం తగ్గుతుందనే భయంతో చమురు ధరలు ప్రారంభంలో పడిపోయాయి. ఆ తర్వాత భారీగా పెరిగాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదలను గత నెలలో నమోదు చేశాయి. ఓ విధంగా ఊగిసలాటలో ఉన్నాయి. అయితే కొత్త క్యాలెండర్ ఏడాదిలో మాత్రం పెరుగుతున్నాయి. నిన్న భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ ధర 82.30 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 79.81 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఇలాగే స్థ్రిరంగా పెరిగితే మన వద్ద ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications