పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు బుధవారం(డిసెంబర్ 15) కూడా యథాతథమే. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.
లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చమురు వినియోగం తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదల గతవారం నమోదు చేసింది. గతవారం బ్రెంట్ క్రూడ్ ఏకంగా 7 శాతం లాభపడింది. ఆ తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ నమోదయింది. బ్రెంట్ క్రూడ్ చివరి వారంలో 75.15 డాలర్ల వద్ద ముగిసింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 71.67 డాలర్ల వద్ద ముగిసింది.
అతి చౌక, ఎక్కువ ధర
ఇటీవలి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు భారత్‌లో చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడం దేశీయంగా ధరలపై ప్రభావం చూపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గించడంతో సామాన్యుడిపై కాస్త భారం తగ్గింది. అయితే ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఏ దేశంలో, ఎంత ఉన్నాయో తెలుసా? వెనిజులాలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత చౌక. డిసెంబర్ 6వ తేదీన లీటర్ పెట్రోల్ ఇక్కడ రూ.1.885 (మన భారత కరెన్సీలో). ప్రపంచంలోనే గ్యాసోలైన్‌ను చౌకకు అందించే దేశం ఇది. ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.3.866గా ఉంది. ప్రపంచంలో చౌక ధరకు అందించే రెండో దేశం ఇది. ఇక, ప్రపంచంలోనే ఎక్కువ ధర ఉన్న దేశం హాంగ్‌కాంగ్. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.195.113. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో రూ.170.7. అమెరికాలో లీటర్ పెట్రోల్ ధర భారత కరెన్సీలో రూ.74.021. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్యాసోలైన్ ధర సగటున లీటర్‌కు రూ.90.83గా ఉంది.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications