పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడో రోజు స్థిరంగా ఉన్నాయి. బుధవారం, ఏప్రిల్ 13వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పెరుగుదల ప్రారంభమైంది. మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఇటీవల స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.
మార్చి 22వ తేదీ నుండి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. మొత్తం 23 రోజులలో 14 రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి.

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్‌కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 వద్ద ఉంది.
ఇదిలా ఉండగా, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో రైడ్ హెయిలింగ్ కంపెనీ ఉబర్ క్యాబ్ ధరలను పెంచింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ధరలు రూ.100 దాటాయి. దీంతో ఛార్జీని పెంచింది. ఢిల్లీ, కోల్‌కతాలలో 12 శాతం, హైదరాబాద్, ముంబైలలో 15 శాతం పెంచినట్లు తెలిపింది. ఓలా కూడా మేజర్ సిటీలలో ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. తమ మినీ, ప్రైమ్ క్యాబ్స్‌కు హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో 16 శాతం పెంచినట్లుగా తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications