Pakistan Crisis: పక్కనే ఉన్న దాయాది దేశంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కనికరం లేకుండా రేట్లను పెంచేస్తూ.. వారి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ కష్టాలు తగ్గకపోవడంతో దేశ ప్రజలపై మరోసారి ద్రవ్యోల్బణం బాంబు పేల్చింది. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ పదవీకాలం పూర్తయిన తర్వాత.. సోమవారం ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్-ఉల్-హక్ కాకర్ నియమితులయ్యారు. అయితే ఆయన మెుదటి నిర్ణయం దేశ ప్రజలపై భారాన్ని పెంచేసింది. దీంతో అకస్మాత్తుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ప్రస్తుతం పాకిస్థాన్ లో లీజరుపై రూ.17.50 రేటు పెరిగిన తర్వాత రూ.290.45కి చేరుకుంది. ఇదే క్రమంలో హైస్పీడ్ డీజిల్ ధర రూ.20 పెరిగటంతో రూ.293.40కి చేరుకుంది. పెరిగిన కొత్త ఇంధన ధరలు 16 ఆగస్టు 2023 నుంచి అమలులోకి నస్తాయని నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన రేట్లు దీనికి కారణంగా వెల్లడించింది. కేవలం 15 రోజుల్లోనే పాకిస్థాన్‌లో చమురు ధరలు లీటరుకు దాదాపు రూ.40 మేర పెరిగాయి.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ద్రవ్యోల్బణం పాకిస్థాన్ లో మాత్రం ఆర్థిక విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. దాయాది దేశంలో ద్రవ్యోల్బణం జూన్ నెలలో 29.4 శాతం నుంచి స్వల్పంగా తగ్గి.. జూలై నెలలో 28.3 శాతంగా నమోదైంది. దీనికి ముందు మే నెలలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 38 శాతానికి ద్రవ్యోల్బణం ఎగబాకింది. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రే ఇంధన ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంపై సగటు పాకిస్థానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తాము బతికేదెలా అంటూ ప్రశ్నిస్తున్నారు. జనవరి 1, 2023 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధర లీటరుకు రూ.75.65 పెరిగింది.


Click it and Unblock the Notifications