పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాదులో లీటరు పెట్రోల్ ధర ఎంతో తెలుసా..?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో వరసగా మూడో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటరుకు 16 పైసలు మేరా పెట్రోలు ధరలు పెరిగాయి. ఆయిల్ సంస్థలు ధరలపై పునఃసమీక్షలు జరిపిన నేపథ్యంలో వరుసగా మూడో రోజు పెట్రోలు ధరలు పెరగడం విశేషం. ఢిల్లీలో రూ.81.19గా ఉన్న ధర రూ.81.35కు పెరిగింది. దేశ రాజధానిలో 45 పైసలు మేరా పెరిగింది. గత వారం రోజుల్లో ఢిల్లీలో పెట్రోలు ధరలు 92 పైసలు మేరా పెరిగాయి. ఇక గత 24 గంటల్లో గురుగ్రామ్ మరియు ఢిల్లీ నగరాల్లో 33 పైసల మేరా పెట్రోలు ధరలు పెరిగాయి. ఇక ముంబై కోల్‌కతా నగరాల్లో పెట్రోల్ ధరలు 15 పైసలు మేరా పెరిగాయి.

గత మూడురోజుల్లో ముంబై నగరంలో పెట్రోలు ధర 44 పైసలు మేరా పెరిగింది. గత వారం రోజుల్లో ముంబైలో 83 పైసలు మేరా ధరలు పెరిగాయి. ఇక ఇతర మెట్రో నగరాలైన హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలలో వరుసగా 17 పైసలు, 16 పైసలు, 13 పైసలు మేరా పెరిగాయి. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోల్ రూ.88.02 ఉండగా హైదరాబాదులో రూ.84.55, చెన్నైలో రూ.84.40, బెంగళూరులో రూ. 83.99, కోల్‌కతాలో రూ.82.87, నోయిడాలో రూ.81.80 గురుగ్రామ్‌లో రూ.79.52గా ఉన్నాయి.

Petrol price increase in the metro cities for the third straight day

ఇదిలా ఉంటే డీజిల్ ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. గత 20 రోజులుగా డీజిల్ ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. ఢిల్లీ నగరంలో లీటర్ డీజిల్ ధర రూ.73.56గా ఉండగా ముంబైలో రూ. 80.11గా ఉంది. చెన్నై నగరంలో లీటర్ డీజిల్ ధర రూ. 78.86గా ఉండగా .. కోల్‌కతాలో రూ.77.06గా ఉంది. మొత్తానికి రానున్న రోజుల్లో మళ్లీ పెట్రోలు ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో డీజిల్ ధరలు కూడా సమానంగా పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+