ముంబైలో రూ.100కు చేరువలో పెట్రోల్ ధర, ఏప్రిల్ నెలలో ఉత్పత్తి ఎంత తగ్గిందంటే?

పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. మెట్రో నగరాల్లో సరికొత్త రికార్డును తాకాయి. నేడు (మే 23) లీటర్ పెట్రోల్ పైన 17 పైసలు, లీటర్ డీజిల్ పైన 29 పైసలు పెరిగింది. ఈ నెలలో ఇది 12వ పెంపు. తాజా పెంపుతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100కి మరో యాభై పైసల దూరంలో ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.21, లీటర్ డీజిల్ రూ.84.07గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.91.30గా ఉంది. దేశీయ చమురు రంగ కంపెనీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఇంధన ధరలను సవరిస్తాయి.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర

ముంబైలో పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.91.30

కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.27, డీజిల్ రూ.86.91

చెన్నైలో పెట్రోల్ రూ.94.86, డీజిల్ రూ.88.87

బెంగళూరులో పెట్రోల్ రూ.96.31, డీజిల్ రూ.89.12

హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.88, డీజిల్ రూ.91.65

తిరువనంతపురంలో పెట్రోల్ రూ.95.19, డీజిల్ రూ.90.36

జైపూర్‌లో పెట్రోల్ రూ.99.68, డీజిల్ రూ.92.78

పాట్నాలో పెట్రోల్ రూ.96.19, డీజిల్ రూ.90.07

చండీగడ్‌లో పెట్రోల్ రూ.89.66, డీజిల్ రూ.83.73

పన్నులే అధికం

పన్నులే అధికం

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90.

డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్‌కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.

తగ్గిన ఉత్పత్తి

తగ్గిన ఉత్పత్తి

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ క్షీణించింది. అలాగే సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఏప్రిల్ నెలలో చమురు రిఫైరీలు తక్కువ క్రూడ్‌ను ప్రాసెస్ చేశాయి. భారత్‌లోను సెకండ్ వేవ్ కారణంగా ప్రాసెస్ తగ్గింది. దేశీయ అతిపెద్ద రిఫైనర్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తన మొత్తం సామర్థ్యంలో ఏప్రిల్ నెలలో సగటున 84 శాతం ప్రాసెస్ చేసింది.

అంతకుముంది ఇది 96 శాతంగా ఉంది. ఏప్రిల్ నెలలో దేశీయ చమురురంగ కంపెనీలు ప్రాసెస్ చేసిన చమురు 19.89 బిలియన్ డాలర్లు. మార్చి నెలతో పేలిస్తే ఇది 1.2 శాతం తక్కువ. అయితే గత ఏడాది మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి తగ్గింది. ఏడాది ప్రాతిపదికన మాత్రం 35 శాతం పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+