కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు కాస్త తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకపోవడంతో పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే తగ్గుతుంది. అసోం, మణిపూర్, గోవా, త్రిపుర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాలు తోడు కావడంతో పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.17 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం తగ్గింపు మాత్రమే ఉంది. మందగమనం, కరోనా వంటి కఠిన పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి, ఇక్కడ కూడా ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గత మూడేళ్లలో మొదటిసారి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో చాలాచోట్ల డీజిల్ ధరలు రూ.100 దిగువకు వచ్చాయి. పెట్రోల్ ధరలు కూడా కాస్త తగ్గాయి.

హైదరాబాద్‌లో ధరలు
ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో తెలంగాణలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కేంద్రం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎక్సైజ్ సుంకంపై రాష్ట్రంలో వ్యాట్ తగ్గడంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై 12.79 చొప్పున ఊరట కలిగింది. దీంతో గురువారం నగరంలో పెట్రోల్ లీటర్ ధర రూ.114.51 నుండి రూ.108.18కి, డీజిల్ రూ.107.40 నుండి రూ.94.61కి తగ్గింది.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
- Delhi పెట్రోల్ ధర 103.97, డీజిల్ ధర 86.67,
- Mumbai పెట్రోల్ ధర 109.98, డీజిల్ ధర 94.14,
- Chennai పెట్రోల్ ధర 101.40, డీజిల్ ధర 91.43,
- Kolkata పెట్రోల్ ధర 104.67, డీజిల్ ధర 89.79,
- Bhopal పెట్రోల్ ధర 112.56, డీజిల్ ధర 95.40,
- Ranchi పెట్రోల్ ధర 98.52, డీజిల్ ధర 91.56,
- Bangalore పెట్రోల్ ధర 107.64, డీజిల్ ధర 92.03,
- Lucknow పెట్రోల్ ధర 101.05, డీజిల్ ధర 87.09,
- Noida పెట్రోల్ ధర 101.29, డీజిల్ ధర 87.31,

క్రూడాయిల్ ధరలు తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. క్రూడ్ ధరలు 82 డాలర్ల దిగువకు వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 81.99 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 80.86 డాలర్ల వద్ద కదలాడింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వానికి నెలకు రూ.8700 ఆదాయం తగ్గుతుంది. అంటే ఏడాదికి రూ.1 లక్ష కోట్ల మేర రెవెన్యూ పైన ప్రభావం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications