2 నెలల్లో 35సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు, ఢిల్లీలో రూ.100కు చేరువలో...
ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు నెలల కాలంలో 35సార్లు పెరిగింది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో రూ.100 క్రాస్ చేసిన పెట్రోల్, ఢిల్లీ, కోల్‌కతాల్లో రూ.100కు చేరువలో ఉంది. చమురు ధరలు నేడు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 34 పైసల నుండి 35 పైసలు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106 సమీపానికి చేరుకుంది. లీటర్ పెట్రోల్ రూ.105.95గా ఉంది. కోల్‌కాలో రూ.99.88 ఢిల్లీలో 99.90గా, చెన్నైలో రూ.100.78గా ఉంది.
రెండు నెలల కాలంలో డీజిల్ ధర 34 సార్లు పెరగగా, పెట్రోల్ ధర 35 సార్లు పెరిగింది. ముంబైలో లీట్ డీజిల్ రూ.9691, ఢిల్లీలో రూ.89.36, చెన్నైలో రూ.93.94, కోల్‌కతాలో రూ.92.31గా ఉంది. 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్ము కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్, లడక్, సిక్కిం రాష్ట్రాల్లో సెంచరీ దాటింది.

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను బట్టి ఆయా రాష్ట్రాల్లో ఆయా ధరలు ఉంటాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్ మార్క్ యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 1.76 డాలర్లు పెరిగి 75.23 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బ్రెంట్ క్రూడాయిల్ సెప్టెంబర్ 1.22 డాలర్లు పెరిగి 75.84 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications